ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

Published Thu, Jan 10 2019 9:42 AM

Sensex still above 36K, Nifty below 10850 - Sakshi

సాక్షి, ముంబై : వరుస లాభాల అనంతరం దేశీయ స్టాక్‌మార్కెట్లు  నేడు స్వల్ప నష్టాలతో ప్రారంభమైనాయి. సూచీలు రెండూ కీలక మద్దతు స్థాయిలకు ఎగువన ట్రేడ్‌ అవుతూ మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌ 47పాయింట్లు క్షీణించి 36,166 వద్ద, నిఫ్టీ 23 పాయింట్ల నష్టంతో 10,831 వద్ద  అంటే 10850కి దిగువన  కొనసాగుతోంది. దాదాపు అన్ని సెక్టార్లలోనూ ప్రాఫిట్‌ బుకింగ్‌ ధోరణి కనిపిస్తోంది.  

టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, ఎస్‌బ్యాంకు, ఐషర్‌ మోటార్స్‌, ఇన్ఫోసిస్‌, విప్రో గెయిల్‌, కోల్‌ ఇండియా, ఐటీసీ లాభపడుతుంగా,  భారతి ఇన్‌ఫ్రాటెల్‌, సన్‌ ఫార్మా,  ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌, జెట్‌ఎయిర్‌వేస్‌, ఇండిగో నష్టపోతున్నాయి.  

అటు డాలరుమారకంలో కరెన్సీ  రుపాయి ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించింది. 

Advertisement
Advertisement