టీఎస్‌టీడీసీ చైర్మన్‌గా భూపతిరెడ్డి ప్రమాణస్వీకారం 

10 Jun, 2018 01:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(టీఎస్‌టీడీసీ) చైర్మన్‌గా పి.భూపతిరెడ్డి పదవీ ప్రమాణస్వీకారం చేశారు. శనివారం హిమాయత్‌నగర్‌లోని టీఎస్‌ టీడీసీ భవన్‌లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. టీఎస్‌టీడీసీ ఎండీ బి.మనోహర్‌ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ... పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి పాటుపడతానన్నారు. కార్యక్రమంలో టీఎస్‌టీడీసీ పీఆర్వో పురందర్, టీఎస్‌టీడీసీ అధికారులు సుమిత్‌సింగ్, జనార్దన్, సత్యకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు టీఎస్‌టీడీసీ కాంట్రాక్ట్‌ – ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లా యీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి తన సంఘ ప్రతినిధులతో భూపతిరెడ్డిని కలసి అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు