‘శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు కారణం కేసీఆరే’

13 Oct, 2019 14:20 IST|Sakshi

ఎంపీ అరవింద్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు తెలం‍గాణ ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని బీజేపీ ఎంపీ అరవింద్‌ ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా జీహెచ్‌ఎంసీ యూనియన్‌ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ఎంపీ అరవింద్‌, మాజీ ఎంపీ వివేక్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సొంత కుటుంబం కోసం కేసీఆర్‌ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ కుటుంబంలో డబ్బు వ్యామోహం బాగా పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియదని పరిస్థితి ఉందని.. కేసీఆర్‌ ప్రభుత్వం కూలిపోయినా బాధపడే వారెవరూ లేరని’ అరవింద్‌ వ్యాఖ్యానించారు. అహంకారపూరిత ధోరణి వలన నిజామాబాద్‌లో కేసీఆర్‌ కూతురు కవితకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందని ఆయన నిప్పులు చెరిగారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు