ఆర్టీసీపై వారం రోజుల్లో సమావేశం 

22 Nov, 2019 04:11 IST|Sakshi

కేంద్రమంత్రి గడ్కరీ హామీ ఇచ్చారన్న బీజేపీ ఎంపీలు  

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై సమగ్రంగా చర్చించేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ ఎండీ, ఆ శాఖ ఉన్నతాధికారులతో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వారంరోజుల్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారని బీజేపీ ఎంపీ లు తెలిపారు. కార్మికుల సమస్యలపై ఆ సమావేశంలో చర్చిస్తానని గడ్కరీ హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. పార్లమెంటులో గురువారం కేంద్రమంత్రి గడ్కరీని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు కలసి ఆర్టీసీ సమ్మెపై చర్చించారు.

డిమాండ్ల సాధన కోసం కార్మికులు 26 మంది చనిపోయా రని చెప్పగానే గడ్కరీ చలించిపోయారని ఎంపీలు మీడియాకు తెలిపారు. సమ్మెపై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌తో మాట్లా డేందుకు గడ్కరీ ఫోన్‌ చేయగా ఆయన అందుబాటులోకి రాలేదని చెప్పారు. పాక్‌ పోలీసుల అదుపులో ఉన్న ప్రశాంత్‌ను స్వదేశానికి చేర్చేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్‌లకు బీజేపీ ఎంపీలు లేఖలు రాశారు.  

మరిన్ని వార్తలు