తడిసిన ధాన్యమూ కొనుగోలు

12 May, 2014 02:00 IST|Sakshi

కలెక్టరేట్,న్యూస్‌లైన్:  తడిసిన ధాన్యంపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం క్వింటాలుకు రూ. 1,345 చెల్లించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడా రు. జిల్లాలో కురిసిన అకా ల వర్షాల వల్ల కొన్ని ప్రాం తాల్లో రబీ ధాన్యం తడిసి ముద్దయ్యిందన్నారు. అదేవిధంగా  వారం రోజులుగా రైస్‌మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేయక పోవడంపై వారిని పిలిపించి మాట్లాడినట్లు తెలిపారు. ఎక్కడైనా కొనుగోలు కేంద్రాల్లో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొనుగోలు చేయకుంటే రైతులు టోల్‌ఫ్రీ 18004256644, ల్యాండ్ 08462-221801 నంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 28,990 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు.

 మరో వంద కొనుగోలు కేంద్రాలు
 మోర్తాడ్ : వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా మరో వంద కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి కొండల్ రావు తెలిపారు. ఆదివారం మోర్తాడ్, దోన్‌పాల్‌లలో తడిసిన వరి ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ఇందిర క్రాంతి పథం ఆధ్వర్యంలో ఇప్పుడు ఉన్న కొనుగోలు కేంద్రాలకు అదనంగా మరో వంద కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ అంగీకరించారని ఆయన తెలిపారు.

అవసరం ఉన్న చోట ఆయా గ్రామాల మిహ ళా సమాఖ్యలు ప్రతిపాదనలు పంపితే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు నష్టపోకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎక్కడైనా లారీల కొరత, గన్నీ సంచుల కొరత ఉన్నా జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ సెల్ నంబర్ 7702003545కు ఫోన్ చేయాలన్నారు. 17 శాతం తేమ ఉన్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. రైతులు దళారులకు ధాన్యం అమ్మి నష్టపోవద్దని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు