రుణ మాఫీ, కుల గణన

6 Nov, 2023 05:30 IST|Sakshi

ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్‌

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీకి ఈ నెల 7, 17వ తేదీల్లో రెండు విడతలుగా జరిగే ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. కులగణన, ధాన్యానికి మరింత మద్దతు ధర, రైతులకు రుణామాఫీ, సబ్సిడీ ధరకే వంటగ్యాస్‌ వంటివి ఇందులో ప్రధాన హామీలుగా ఉన్నాయి.  రాజ్‌నందన్‌గావ్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం బఘేల్‌ ఎన్నికల హామీలను ప్రకటించారు.

మళ్లీ అధికారమిస్తే.. ఎకరానికి 20 క్వింటాళ్ల వరిధాన్యాన్ని రూ.3,200 చొప్పున కొనుగోలు చేస్తామని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామని తెలిపారు. తునికాకు స్టాండర్డ్‌ బ్యాగుకు రూ.4 వేలకు బదులు రూ.6 వేలు చెల్లిస్తామని, సేకరణ దారులకు అదనంగా రూ.4 వేల బోనస్‌ ఇస్తామని  ప్రకటించారు. మహిళలకు వంటగ్యాస్‌ సిలిండర్‌పై రూ.500 సబ్సిడీ   ఖాతాల్లోనే జమచేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు