మనసుకవి ఆచార్య ఆత్రేయ

19 May, 2015 20:33 IST|Sakshi

హైదరాబాద్: మనసుకవి ఆత్రేయ మనసు పై పలు సినిమా పాటలు రాసినా... ఈ రంగంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రగతిశీల దృక్పదం ఉన్న నాటక రచయితగా ప్రసిద్ది పొందారని... కిడాంబి నరసింహాచార్యులుగా సినీ రంగ ప్రవేశం చేశాక ఆత్రేయగా మారారని డా.సి.నారాయణ రెడ్డి గుర్తుచేసుకున్నారు.. మనసు కవి ఆచార్య ఆత్రేయ జయంతి ఉత్సవాల సందర్భంగా అభినందన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం శ్రీ త్యాగరాయ గానసభలో జరిగిన అభినందన-ఆత్రేయ అవార్డుల బహూకరణ సభకు ముఖ్య అతిదిగా విచ్చేసి ప్రసంగించారు.

ఆత్రేయ రచించిన ఎన్‌జిఓ, కప్పలు, విశ్వశాంతి, ఆయనను మహారచయితగా నిలబెట్టాయన్నారు. సినిమా సంభాషణలతోపాటు మాటలు, పాటలు ఛందోబద్ద పద్యాలురాసిన ఆత్రేయ సాహిత్యంలో తన ప్రతిభను చతుర్ముఖంగా ఆవిష్కరించారన్నారు. ఈ సందర్బంగా ప్రముఖ సినీ మాటల రచయిత మరుధూరి రాజా, సినీ గేయ రచయిత వెన్నెలకంటిలను అభినందన-ఆత్రేయ అవార్డులతో ఘనంగా సత్కరించారు.

మరిన్ని వార్తలు