బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

28 May, 2015 11:55 IST|Sakshi

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా రామగుండంలో ఓ బాల్య వివాహాన్ని అధికారులు, పోలీసులు సంయుక్తంగా గురువారం అడ్డుకున్నారు. వరంగల్ జిల్లా కాశీబుగ్గకు చెందిన బాలికకు రామగుండం సుభాష్ నగర్‌కు చెందిన యువకుడితో వివాహ నిశ్చయమైంది. రామగుండం కార్పోరేషన్ పరిధిలోని నాలుగోవ డివిజన్ సుభాష్ నగర్‌లో 14 ఏళ్ల బాలికకు వివాహం జరుగుతుందని స్థానికులు... పోలీసులు, ఐసీడీఎస్ అధికారులకు సమాచరం అందించారు.  దాంతో తహసీల్దార్, ఐసీడీఎస్, పోలీసులు వెంటనే అప్రమత్తమై... సుభాష్ నగర్ చేరుకుని... బాల్య వివాహన్ని అడ్డుకున్నారు. అనంతరం బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

మరిన్ని వార్తలు