రేపు రాష్ట్ర వ్యాప్తంగా టి.కాంగ్రెస్ నిరసనలు

22 Aug, 2016 19:21 IST|Sakshi
రేపు రాష్ట్ర వ్యాప్తంగా టి.కాంగ్రెస్ నిరసనలు
హైదరాబాద్: మహారాష్ట్రతో ఒప్పందాన్ని నిరసిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కమార్ రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా మట్టపల్లి పుష్కర ఘాట్లో సోమవారం ఆయన పుష్కర స్నానమాచరించారు. 
 
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ...ప్రభుత్వం చేసుకుంటున్నది మహా ఒప్పందం కాదు, ఇది మహా ద్రోహమని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాణహిత-చేవెళ్లను కాదని రీ డిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని ఉత్తమ్ అన్నారు. మహారాష్ట్రతో సీఎం కేసీఆర్ కుదుర్చుకునే ఒప్పందం వల్ల తెలంగాణకు నష్టమేనన్నారు. దీనిపై మంగళవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు ఉత్తమ్ తెలిపారు. 
 
మట్టపల్లి పుణ్యక్షేత్రం ఎలాంటి అభివృద్ధి చెందలేదన్నారు. యాదాద్రిలా మట్టపల్లిని తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. స్థానికంగా బ్రిడ్జి నిర్మాణం పూర్తయి ఉంటే ఇంకా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చేవారన్నారు. టీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఉత్తమ్ అన్నారు. 
మరిన్ని వార్తలు