‘కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్’ కొనసాగింపు

2 Jul, 2014 02:21 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పదవీ కాలాన్ని తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంతవరకు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా శాఖల్లో వారి అవసరం తీరే వరకు... లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు... వీటిల్లో ఏదీ ముందయితే దానిని అమలు చేయాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఆర్థిక శాఖ..  మూడు నెలల పొడిగింపు మాత్రమే ఇవ్వాలంది. ఆలోగా ఆయా శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది అవసరం నిజంగా ఉందా లేదా అన్న అంశంపై పూర్తి సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించింది. అధికారులు మూడు నెలల కాలపరిమితికి ఫైలు పంపిం చగా..

సీఎం కె.చంద్రశేఖర్‌రావు తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు వీరిని కొనసాగించేలా కాలపరిమితి లేకుండా ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలి సింది. దాని ఆధారంగా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవాలని కూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్థిక శాఖ అనుమతి ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుందన్నారు. ప్రభుత్వంలోనే కాక గ్రామ, మున్సిపల్, మండల, జిల్లా పరిషత్, డివి జన్లు.. జిల్లా, జోనల్, మల్టీజోనల్ కార్యాలయాలు, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న వారందరికీ ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వ్యక్తిగత, కాంట్రాక్టు ఏజెన్సీలతో కుదుర్చుకునే ఒప్పం దాల కాల పరిమితి ఏడాదికి మించకుండా, నియమ నిబంధనలు స్పష్టంగా పేర్కొంటూ ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు