రొయ్యల పెంపకంపై లొల్లి

13 Aug, 2014 03:37 IST|Sakshi

నిజాంసాగర్:  వందలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న నిజాంసాగర్ ప్రాజెక్టులో రొయ్యల పెంపకం చేపట్టవద్దని మత్య్సకార్మికుల ఆందోళ నకు దిగారు. చేపపిల్లలను పెంచాలని కొందరు, రొయ్యలను పెంచాలని మరికొందరు కార్మికులు ఒకరినొకరు దూషించుకున్నారు. మంగళవారం మండలంలోని అచ్చంపేట చేపపిల్లల విత్తనోత్పత్తి కేంద్రం వద్ద స్థానిక మత్య్సకార్మిక సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి  జిల్లా మత్స్యశాఖ ఏడీ, సంఘం అధ్యక్షుడు బాలక్రిష్ణ అధ్యక్షత వహించారు.

 సమావేశ ముఖ్య ఉద్దేశాన్ని ఏడీ  కార్మికులకు వివరించారు. అంతలోనే కొం దరు కార్మికులు నిజాంసాగర్ ప్రాజెక్టులో రొయ్యల పెంపకాన్ని నిషేధించాలంటూ  నినాదాలు చేశారు. ప్రాజెక్టులో చేప పిల్లల పెంపకం నాలుగేళ్ల నుంచి చేపట్టకపోవడంతో దళారులు రొయ్యల పెంపకానికి అలవాటుపడ్డారన్నారు. చేప పిల్లలను నాశనం చేస్తున్న రొయ్యల పెంపకాన్ని నిషేధించాలని సమావేశంలో నినాదాలు చేశారు. మరికొందరు కార్మికులు చేప పిల్లలతో పాటు రొయ్యల పెంపకాన్ని చేపట్టాలని డిమాం డ్ చేయడంతో సమావేశంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కార్మికులు ఒకరిని ఒకరు తోసుకుంటూ వేదిక వద్దకు వచ్చి మత్య్సశాఖ అధికారులను నిల దీశారు.

దీంతో  సమావేశంలో ఉద్రిక్తత నెలకొనడంతో అధికారులు జోక్యం చేసుకున్నారు. కార్మికుల నిర్ణయం మేరకు ప్రాజెక్టులో చేపపిల్లలను పెంచుతామన్నారు. ప్రైవేట్ వ్యాపారులు కాకుండా ప్రభుత్వ పరంగా రొ య్యల పెంపకానికి కృషిచేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. నాలుగేళ్ల నుంచి చేప పిల్లల పెంపకం లేకపోవడంతో ఉపాధి కోల్పోయామని, తమను ఆదుకోవాలని  అధికారులతో కార్మికులు  మొరపెట్టుకున్నారు. కార్యక్రమంలో స్థానిక మత్స్యశాఖ అధికారులు రాములు, రూపేందర్, రాజేంద్రప్రసాద్, స్థానిక మత్య్సకార్మిక సంఘం నాయకుడు రాములు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా