‘సర్వే’ నిష్పక్షపాతంగా నిర్వహించాలి

13 Aug, 2014 03:34 IST|Sakshi

 కామారెడ్డి రూరల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న చేపట్టనున్న ఇంటింటి సర్వేను ప్రతి ఉద్యోగి నిష్పక్షపాతంగా వ్యవహరించి పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ సూచించారు.  మంగళవారం  పట్టణంలోని ఆర్‌కే డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ, కర్షక్ బీఈడీ కళాశాలల్లో ఎన్యూమరేటర్లకు ఒక రోజు శిక్షణ  ని ర్వహించారు. ఈ  కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై సర్వే వివరాల నమోదు కోసం ప్రభుత్వం నిర్ధేశించిన పట్టికలోని ప్రతి అంశాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.

 అనంతరం మాట్లాడుతూ..  అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడానికి ఈ సర్వే ఎంతో ముఖ్యమైందన్నారు. అభివృద్ధి పథకాలు రూపొందించి అర్హులైన వారికి అందాలంటే డాటా బేస్‌లైన్ సమాచారం ఎంతో ము ఖ్యమన్నారు. అందుకే ప్రభుత్వం ఈ సర్వేను చేపడుతుందన్నారు. ఈ సర్వే ద్వారా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించనుందన్నారు. సర్వే అధికారులకు ప్రజలు పూర్తిగా సరైన వివరాలను  అందించాలని సూచించారు. వంట గ దులను బట్టే కుటుంబాల సర్వే చేపట్టాల న్నారు.

గల్ఫ్ వెళ్లిన వారి విషయాలు, ఇంట్లో లే ని వారి వివరాలు నమోదు చేయకూడదన్నారు. హాస్టళ్లో ఉన్న విద్యార్థులు, ఆస్పత్రుల్లో ఉన్న వారు ఆధారాలు చూపిస్తేనే వివరాలు నమోదు చేయాలన్నారు. సమగ్ర సర్వేలో ఎలాంటి త ప్పులు లేకుండా పకడ్బందీగా చేపట్టాలన్నారు. సర్వే సమయంలో ఇంటిపైనున్న స్టిక్కర్లను చూ సి ఈవీ నెంబర్ నమోదు చేసుకోవాలని సూ చించారు.  ఒక్కో ఉద్యోగి సగటున 20 నుంచి 30 కుటుంబాలను సర్వే చేసేలా ప్రణాళికలు రూ పొందించమన్నారు.

 జిల్లా వ్యాప్తంగా 27,500 మంది ఎన్యూమరేటర్లను నియమిం చినట్లు చెప్పారు. సర్వే అనంతరం ఎంతమంది ఏయే పథకాలకు అర్హులనే విషయాలతో స మగ్ర సర్వేను బట్టి ప్రణాళికలు తయారు చేయాడానికే ఈ సర్వే చేపడుతున్నట్లు వివరిం చారు.   సమావేశంలో ఐకేపీ పీడీ వెంకటేశం, నెడ్‌క్యాప్ జిల్లా మేనేజర్ రామేశ్వర్‌రావు,  ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహశీల్దార్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు