పెరుగుతున్న కరోనా అనుమానితులు

5 Feb, 2020 12:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా మహమ్మారి కోరలు చాస్తూ అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా అనుమానితుల సంఖ్య పెరగడం కలకలం రేపుతోంది. కేరళలో కరోనా కేసులు నమోదు కావడంతో తెలంగాణలో అధికారులు అలర్ట్‌ అయ్యారు. కేరళలో పాజిటివ్‌ వచ్చినవారితోపాటు ప్రయాణించిన విమానంలోని తోటి ప్యాసింజర్లు, ఎయిర్‌ హోస్టెస్‌తో పాటు పైలట్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చైనా నుంచి జనవరి నెలలో వచ్చిన ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 25మందికి కరోనా టెస్టులు చేయగా 21 మందికి నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. మరో నలుగురి రిపోర్టులు రావాల్సి ఉంది.

చైనా నుంచి వచ్చిన వాళ్ల కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులను సైతం వైద్యలు పరిశీలిస్తున్నారు. ఇక బుధవారం ఎయిర్‌పోర్టులో నలుగురు ప్రయాణికులను కరోనా అనుమానితులుగా అధికారులు గుర్తించారు. మరోవైపు నగరంలోని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.శ్రవణ్‌పై డీఎంఈ రమేష్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. సమయం దాటుతున్నా ఆసుపత్రికి రాకపోవడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్లు, ఇతర వైద్య నిపుణులు సమయపాలన పాటించాలని హెచ్చరించినప్పటికీ అతని తీరు మారకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేయాలని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు