కొట్టుకున్న కౌన్సిలర్లు

20 Jul, 2014 02:38 IST|Sakshi
కొట్టుకున్న కౌన్సిలర్లు

కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ సమావేశం రణరంగంగా మారిం ది. కౌన్సిలర్లు పరస్పరం దాడులు చేసుకోవడంతో నాలుగు గం టలపాటు ఉద్రిక్తత కొనసాగింది. పోలీసులు లాఠీచార్జి చేసి పరి స్థితిని అదుపులోకి తెచ్చారు. మున్సిపల్ ప్యానల్, కాంట్రాక్టు కమిటీ ఎన్నికల కోసం శని వారం చైర్‌పర్సన్ సుష్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

ప్రొటోకాల్‌ను పాటించడం లేదంటూ ముందుగా టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు కమిషనర్ తో వాగ్వాదానికి దిగారు.అదే సమయంలో సమావేశ మందిరంలోకి అడుగుపెట్టిన వైస్ చైర్మన్ మసూద్ అలీ చైర్‌పర్సన్ పోడియం పక్కన కుర్చీ వేయించుకు ని కూర్చున్నారు. ఇందుకు టీఆర్‌ఎస్ కౌన్సిలర్‌లు అభ్యంతరం తెలుపుతూ అధికారులపై విమర్శలకు దిగారు. పోడియం ముందుకు వచ్చి ఆందోళన చేశా రు. దీంతో చైర్‌పర్సన్ సమావేశాన్ని అరగంటపాటు వాయిదా వేసి బయటకు వెళ్లిపోయారు.
 
కుర్చీలు విసురుకుని
ఇదే తరుణంలో వైస్ చైర్మన్, టీఆర్‌ఎస్ కౌన్సిలర్‌ల మధ్య మాటల యుద్ధం పెరిగి ఒకరిపై ఒకరు కుర్చీ లు విసురుకున్నారు. కొట్టుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్ కౌన్సిలర్ భూంరెడ్డి పెదవులకు గాయం కావడం తో వైస్ చైర్మన్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు కార్యాలయం ఎదుట బైఠాయిం  చారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని వైస్‌చైర్మన్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. వైస్ చైర్మన్ మున్సిపల్ అతిథి గృహంలోకి వెళ్లడంతో టీఆర్‌ఎస్ నేతలు అక్కడకు చేరుకున్నారు.
 
పోలీసులను తోసివేసి తలుపును ధ్వంసం చేసి బయటకు పడేశారు. పరిస్థితి చేయిదాటుతోందని గమనించిన పోలీసులు టీఆర్‌ఎస్ నేతలను పక్కకు తోసి వేశారు. వైస్ చైర్మన్‌ను బయటకు తీసుకువచ్చి కారులో ఎక్కించేందుకు యత్నించారు. ఇదే సమయంలో ఇరు పార్టీలవారు పరస్పరం దాడికి దిగారు. ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. వారిని నిలువరించినా ప్రయోజనం లేకపోవడంతో వైస్ చైర్మన్‌ను తిరిగి అతిథి గృహంలోకి తీసుకెళ్లారు. లా ఠీచార్జి చేసి గొడవకు దిగినవారిని తరిమికొట్టి, వైస్‌చైర్మన్‌ను, ఆయన కుమారుడిని బలవంతంగా లాక్కెళ్లి జీపులో ఎక్కించి ఠాణాకు తరలించారు. దీంతో టీఆర్‌ఎస్ నేతలు ఆందోళన విరమించారు.
 
కేసులు నమోదు
మున్సిపల్ సమావేశంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సంఘటనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వైస్‌చైర్మన్ మసూద్, కౌన్సిలర్ జమీల్‌తో పాటు టీఆర్‌ఎస్ కు చెందిన ఆరుగురు కౌన్సిలర్లు భూంరెడ్డి, సంగిమోహన్, ముప్పారపు ఆనంద్, కుంభాల రవి, అంజద్, మాసుల లక్ష్మీనారాయణలపై కేసులు నమోదు చేశా రు. ఇరు వర్గాలవారు పరస్పరం చేసుకున్న పిర్యాదు ల మేరకు కేసులు నమోదు చేసినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు