కరోనా అలర్ట్‌: ‘ఆ ఫ్లోర్‌కు ఇతరులు వెళ్లొద్దు’

7 Mar, 2020 19:39 IST|Sakshi

గాంధీలో పర్యటించిన మంత్రి ఈటల

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ గాంధీ ఆస్పత్రిలో శనివారం పర్యటించారు. కరోనా వార్డు (ఏడో ఫ్లోర్‌)లో పలు మార్పులు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఏడో ఫ్లోర్‌కు కరోనా  (కోవిడ్-19) బాధితులు తప్ప ఇతరులెవరూ వెళ్లకుండా గట్టి చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆయన ఆదేశించారు. దాంతోపాటు విదేశాల నుంచి వచ్చిన ప్రతిఒక్కరూ 14 రోజులు కరోనా వార్డులో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా వార్డును రెండు విభాగాలుగా చేయాలని, విదేశాలకు వెళ్లి వచ్చిన వారికి కరోనా లక్షణాలు ఉంటే ఒకచోట.. కరోనా లక్షణాలు లేకపోతే మరో వార్డులో ఉంచాలని మంత్రి ఈటల స్పష్టం చేశారు. మంత్రి ఆదేశాల నేపథ్యంలో ఏడో ఫ్లోర్‌లో వైఫై సేవలు అం‍దుబాటులోకి తెచ్చారు. 


(చదవండి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ లేదు : సీఎం కేసీఆర్‌)
(ఆస్పత్రి నుంచి పారిపోయిన పేషెంట్‌)

>
మరిన్ని వార్తలు