‘రాష్ట్రంలో నియంత పాలన’ 

3 Jun, 2018 10:08 IST|Sakshi
మాట్లాడుతున్న ప్రభాకర్‌ 

ఆర్మూర్‌ : అమరవీరుల త్యాగాలతో ఆవిర్భవించిన రాష్ట్రంలో ప్రజాస్వామిక ఆకాంక్షలకు భిన్నంగా కుటుంబ పాలనతో నియంతలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ ఆర్మూర్‌ డివిజన్‌ కార్యదర్శి ప్రభాకర్‌ విమర్శించారు. పట్టణంలోని కుమార్‌ నారాయణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రజల ఆకాంక్షల దీక్ష దినంగా పాటిస్తూ సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సదస్సును శనివారం నిర్వహించారు. ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌ కార్యదర్శి ముత్తెన్న అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. అంతకు ముందు ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర నాయకుడు దేవరాం, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి దాసు మాట్లాడారు. సూర్యశివాజి, ఏపీ గంగారాం, రాజన్న, పీవైఎల్‌ రాష్ట్ర కార్యదర్శి కిషన్, సుమన్, నిఖిల్, గంగాధర్, నరేందర్, ప్రశాం త్, క్రాంతి,లక్ష్మి, అయేషా బేగం పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు