దేశాయిపేట్‌లో దళితులకు సాంఘిక బహిష్కరణ

8 Apr, 2018 10:46 IST|Sakshi
దేశాయిపేట్‌లో మాట్లాడుతున్న దళితులు

బాన్సువాడ టౌ న్‌(బాన్సువాడ) : మండలంలోని దే శాయిపేట్‌లో 14 దళిత కుటుంబా లను గ్రామ పెద్ద లు సాంఘిక బహి ష్కరణ చేశారు. వివరాలిలా ఉన్నా యి. గ్రామంలో దళితులు గత 60 ఏళ్లుగా శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి వేడుకల సమయంలో ఉచితంగా డప్పు కొట్టేవారు. ఈసారి తమకు డబ్బులు చెల్లిస్తేనే డప్పులు కొడతామని వాదించారు. దీంతో గ్రామ పెద్దలు సమావేశమై ఈ విషయంపై చర్చించారు. ఇన్నేళ్లుగా ఉచితంగా డప్పులు కొట్టి ఈసారి డబ్బులు డిమాండ్‌ చేయడం ఏంటని, డబ్బులు చెల్లించే ప్రసక్తే లేదని గ్రామ పెద్దలు తీర్మానం చేశారు. శ్రీరామనవమి రోజు నుంచి 14 దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసి, వారిని ఎవరైనా పనిలో పెట్టుకుంటే రూ.2500 జరిమానా చెల్లించాలని హుకూం జారీ చేశారు.

దీనికి తోడు జీపీలో పనిచేసే ఇద్దరు దళిత కార్మికులను విధులకు రావద్దని సూచించారు. పాఠశాలలో అటెండర్‌గా విధులు నిర్వహించే మరో దళితుడిని విధుల నుంచి తొలగించారు. గత 15 రోజులుగా తమను సాంఘిక బహిష్కరణ చేసినట్లు బాధితులు పేర్కొంటున్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులకు కూడా రానివ్వడం లేదని వాపోయారు. గ్రామంలో పని దొరకక ఇబ్బందులు పడుతున్నామని వారు అంటున్నారు. ఈ విషయంపై బాన్సువాడ పట్టణ సీఐ శ్రీనివాస్‌రెడ్డి వివరణ కోరేందుకు ప్రయత్నించగా, ఆయన ఫోన్‌ స్వీచ్‌ ఆఫ్‌ వచ్చింది.
 

మరిన్ని వార్తలు