74 మంది విద్యార్థులకు అస్వస్థత

4 Nov, 2018 11:31 IST|Sakshi
కళాశాలలో చికిత్సలు పొందుతున్న విద్యార్థినులు

పెర్కిట్‌(ఆర్మూర్‌): ఆర్మూర్‌ మండలంలోని పెర్కిట్‌లో గల సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళా శాలలో ఆహారం వికటించి 74 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కళాశాలలో శుక్రవారం రాత్రి విద్యార్థులు భోజనం చేసి పడుకున్నాక వేకువజామున నుంచి కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. దీంతో కళాశా ల ప్రిన్సిపల్, కేర్‌ టేకర్‌కు సమాచారం ఇవ్వగా వారు ఆర్మూర్‌ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆర్మూర్‌ డిప్యూటీ డీఎం హెచ్‌వో రమేశ్, వైద్యులు అశోక్, స్వాతి వినూత్న, వైద్య సిబ్బంది హుటాహుటిన కళాశాలకు చేరుకున్నారు. ఆర్మూర్‌ డివిజన్‌లోని ఐదు రాష్ట్రీయ బాల ల స్వస్థ్య కార్యక్రమ్‌ బృందాలు కళాశాలకు చేరుకునారు.  తీవ్ర అస్వస్థతకు గురైన 40 మంది విద్యార్థులకు వైద్యాధికారులు కళాశాలలోనే సెలైన్‌ బా టిళ్లు ఏర్పాటు చేసి చికిత్సలు అందజేశారు. మరో 34 మంది విద్యార్థులకు మాత్రలతో నయం చేశా రు. మధ్యాహ్నం విద్యార్థుల పరిస్థితి నిలకడకు వ చ్చింది.

కారణాలు అవేనా.. 
కళాశాలలో 380 మంది విద్యార్థులున్నారు. శుక్రవారం 361 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా రాత్రి ఆహారంలో విద్యార్థులకు పప్పు, ఆలుగడ్డ కూరలను వడ్డించారు. ఆలుగడ్డ కూర మాడి పోవడంతో విద్యార్థులు దాన్ని వదిలి పప్పుతో భోజనం చేశారు. మాడిపోయిన కూరను తినడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కాగా దీనికి ముందు విద్యార్థులు ఐరన్‌ మాత్రలను తీసుకున్నారు. ఖాళీ కడుపుతో ఐరన్‌ మాత్రలను తీసుకోవడంతో వచ్చే గ్యాస్ట్రిక్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురై ఉండవచ్చని కొందరి అభిప్రాయం.

ఆర్నెళ్ల కిందే కళాశాల ఏర్పాటు.. 
ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌లో ఆరు నెలల క్రితం కళాశాలను ఏర్పాటు చేశారు. వర్ని మండలం చందూర్‌లో ఉన్న కళాశాలలో విద్యార్థుల సంఖ్య ఆశించినంత లేక పోవడంతో ఆర్మూర్‌కు తరలించారు. పెర్కిట్‌లోని ఒక ప్రైవేటు కళాశాలను అద్దెకు తీసుకుని తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు కళాశాలలోని అవసానదశకు చేరుకున్న వంట పాత్రలల్లో ఆహార పదార్థాలు వండడం ద్వారా అడుగంటి మాడిపోతున్నాయని వంట చేసేవారు పేర్కొంటున్నారు. 

తిన్న తర్వాతనే ఇలా జరిగింది.. 
రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్ర పోయాం. అయితే కాసేపటికి కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు ప్రారంభమయ్యాయి. కేర్‌ టేకర్‌ దగ్గరకు వెళ్లగా ఉపశమనానికి మందు గోలీలను ఇచ్చారు.  –దివ్య, సెకండియర్, చల్లగరిగ 

కూరలు మాడిపోయాయి.. 
రాత్రి అందజేసిన ఆహార పదార్థాలలో ఆలుగడ్డ కూర మాడిపోయింది. దీంతో పప్పుతో భోజనం చేశాం. ఏం జరిగిందో తెలియదు. ఒక్కసారిగా కళాశాలలోని 70 మంది విద్యార్థులకు అవస్థలు పడ్డాం.  –హారిక, సెకండియర్, చౌట్‌పల్లి  

మరిన్ని వార్తలు