వదంతులను నమ్మొద్దు

27 May, 2018 10:28 IST|Sakshi

వనపర్తి క్రైం: శాంతిభద్రతలు, పౌరసమాజ రక్షణ కోసం కార్డెన్‌ సర్చ్‌ నిర్వహిస్తున్నామని జిల్లా అదనపు ఎస్పీ భాస్కర్‌ అన్నారు. శనివారం తెల్లవారుజామున పట్టణంలోని 26వ వార్డు రాంనగర్‌కాలనీలో జిల్లా పోలీసులు 78 మంది సిబ్బందిచే సోదా చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ కాలనీలో సోదాలు జరపాలని ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు రాంనగర్‌ కాలనీలో తనిఖీ చేపట్టామన్నారు. సెర్చ్‌లో పత్రాలు 32 బైకులు, 2 ఆటోలు, 11 మంది రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనుమానిత వ్యక్తులను అదపులోకి తీసుకున్నామన్నారు. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మవద్దని, అనుమానిత వ్యక్తులు సంచరిస్తే వారిపై దాడిచేయకుండా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. నేరాలు అరికట్టేందుకు పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ సృజన, సీఐ సూర్యనాయక్, సీసీఎస్‌ సీఐ నరేందర్, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేష్, పట్టణ ఎస్‌ఐ నాగశేఖరరెడ్డి, జిల్లాలోని ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు