ప్రజాధనం దుర్వినియోగం కావొద్దు: గుత్తా

21 Nov, 2019 05:06 IST|Sakshi

శాసనసభ కమిటీ హాల్‌లో అంచనాల కమిటీ సమావేశం

హాజరైన మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం వెచ్చించే నిధులు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత శాసనసభ అం చనాల కమిటీపై ఉందని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం శాసనసభ కమిటీ హాల్‌లో జరిగిన అంచనాల కమిటీ తొలి భేటీకి కమిటీ చైర్మన్, దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి అధ్యక్షత వహించారు. మం డలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కాగా, వరుసగా రెండోసారి శాసనసభ అంచనా ల కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సోలిపేటను గుత్తా, హరీశ్, ప్రశాంత్‌రెడ్డి, కమిటీ సభ్యులు అభినందించారు. తర్వాత జరిగిన సమావేశంలో అ సెంబ్లీ వ్యవహారాల్లో ‘పేపర్స్‌ లెయిడ్‌ అన్‌ టేబుల్‌’ కమిటీ (సభకు సమర్పించే పత్రాల పరిశీలన కమిటీ) పాత్రకు ప్రాధాన్యత ఉందని సుఖేందర్‌రెడ్డి అన్నా రు. మండలి పేపర్స్‌ లెయిడ్‌ అన్‌ టేబుల్‌ కమిటీ తొలి సమావేశంలో కమిటీ చైర్మన్‌ సయ్యద్‌ జాఫ్రీ అధ్యక్షతన జరిగింది. 

మరిన్ని వార్తలు