'ఒకటే పన్ను విధానం కోరుతున్నాం'

9 Jun, 2017 12:41 IST|Sakshi
అమరావతి: దేశంలో ఒకటే పన్ను విధానం రావాలని తెలుగు రాష్ట్రాలు కోరుతున్నాయని తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్‌ పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీన జరిగే జీఎస్టీ సమావేశంలో ప్రజల నుంచి వ్యక్తం అవుతున్న అభ్యంతరాలను తెలియజేస్తామన్నారు. సామాన్యులకు భారం కలగకుండా జీఎస్టీ ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఏపీలో బియ్యంపై పన్ను ఉన్నా ఎవరూ కట్టడం లేదు.. అందుకే ప్రాక్టికల్ ట్యాక్స్ ఉండాలని.. ప్రభుత్వం చేసే అభివృద్ది పనులపై పన్నులు తొలగించాలని కోరామన్నారు.
 
హోటళ్లు, గ్రానైట్‌, బీడీలపై ట్యాక్స్ కూడా అభ్యంతరకరంగా ఉందని ఆయన అన్నారు. పన్నుల ఎగవేతకు ఆస్కారం లేకుండా సంస్కరణలు తీసుకొస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాలలో అనేక సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి కోసం పని చేస్తూ ముందుకు పోతున్నామని, అనేక రంగాలలో తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలుస్తున్నాయని ఈటల వివరించారు.
 
మరిన్ని వార్తలు