అంతా చూచిరాతే..

12 Dec, 2016 14:26 IST|Sakshi

నాగార్జున వర్సిటీ దూరవిద్య పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌

మహబూబాబాద్‌ అర్బన్‌: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఓ బీఈడీ కళాశాలలో జరుగుతున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఓపెన్‌ పీజీ, డిగ్రీ పరీక్షల్లో జోరుగా మాస్‌ కాపీయింగ్‌ జరుగుతోంది. శనివారం ఎంఏ పొలిటికల్‌ సైన్స్, ఇంగ్లిష్‌ పరీక్ష జరిగింది. అయితే, పరీక్షలు చూచిరాతలను తలపిస్తు న్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ‘సాక్షి’బృందం శనివారం పరీక్షా కేంద్రానికి వెళ్లింది. బృందం అక్కడి వెళ్లగానే పరీక్ష రాస్తున్న అభ్యర్థులు చిట్టీలు బయటపడేశారు. 

పాస్‌ గ్యారెంటీ అని హామీ ఇస్తూ ఏజెంట్‌లు విద్యార్థులకు చెప్పి గుంటూరుకు చెందిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్యాకేంద్రంలో ప్రవే శాలు ఇప్పిస్తున్నారు.  పరీక్షకు హాజరైతే ఒక రేటు.. హాజరు కాకుంటే మరోరేటు అం టూ డబ్బులు వసూలు చేస్తున్నారు.  పరీక్షల ను  ఉద్యోగులు ప్రమోషన్ల కోసం డిగ్రీ, పీజీ సర్టిఫికెట్‌లు అవసర మున్నందున డబ్బులు ఖర్చు చేసి పరీక్షలు రాస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు కావ డంతో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు చాలామందికి రానున్నాయి.  ఇటీవల మహబూబాబాద్‌ తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ తనిఖీలకు వెళ్లి ముగ్గురు అభ్యర్థులను డిబార్‌ చేశారు.

మరిన్ని వార్తలు