అన్నం పెట్టమని అడిగితే కొట్టాడు.. 

15 Aug, 2018 02:52 IST|Sakshi
ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

సిద్దిపేట రూరల్‌: మధ్యాహ్న భోజనంలో మరోసారి అన్నం పెట్టమని అడిగితే ఓ వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యార్థులను కమిలిపోయేలా కొట్టాడు. ఈ ఘటన చిన్నగుండవెళ్లి శివారులోని ఎల్లంకి కళాశాల మహాత్మా జ్యోతిబాపూలే (నారాయణరావు పేట) బాలుర గురుకుల విద్యాలయంలో కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్న భోజన సమయంలో మరోసారి అన్నం పెట్టాలని అడిగిన 6, 8 తరగతులకు చెందిన విద్యార్థులు రాజేశ్, సుగీర్తి, మంజునాథ్‌ను ప్రిన్సిపాల్‌ రాజమణి ముందే పీఈటీ వెంకటేశ్‌ పైపుతో చితకబాదడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.

విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, సీపీఐ, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్‌ రాజమణి, పీఈటీ వెంకటేశ్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న జిల్లా అసిస్టెంట్‌ బీసీ సంక్షేమాధికారి ఇందిర పాఠశాలకు చేరుకొని ఘటనపై ఆరా తీశారు. బాధ్యులపై చర్యలు తీసుకుం టామని ఆమె హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు