ప్రధాని కారుకూ ఫాస్టాగ్‌ తప్పనిసరి 

20 Nov, 2019 02:37 IST|Sakshi

వీఐపీల వాహనాలకూ ట్యాగ్‌ ఉండాల్సిందే

జీరో బ్యాలెన్స్‌తో ప్రత్యేక స్టిక్కర్లు సిద్ధం

అవి లేని వాహనాలు వస్తే గేట్లు తెరుచుకోవు  

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని, సీఎం లాంటి వీవీఐపీ ల వాహనాలకూ ఫాస్టాగ్‌ తప్పనిసరి కానుంది. టో ల్‌గేట్లు దాటేటప్పుడు కచ్చితంగా వీవీఐపీల కాన్వాయ్‌ల్లోని వాహనాలకూ ఫాస్టాగ్‌ ఉండాలని అధికారులు అంటున్నారు. టోల్‌ప్లాజాల వద్ద రుసుము చెల్లించేందుకు వాహనాలు బారులు తీరాల్సిన పని లేకుండా వేగంగా ముందుకు సాగిపోయేందుకు ఉద్దేశించిన విధానమే ఫాస్టాగ్‌. ఎంతోకాలంగా కేం ద్రం ప్రకటిస్తున్న ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ సిస్టం ఎట్టకేలకు డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. దీనిలో భాగంగా వాహనాలు కచ్చితంగా ట్యాగ్‌ ఏ ర్పాటు చేసుకోవాల్సిందే. ట్యాగ్‌ లేని వాహనాలు వస్తే టోల్‌గేట్లు తెరుచుకోవు.

ఈ పద్ధతి అలవాట య్యే వరకు అప్పటికప్పుడు రుసుము చెల్లించి టో కెన్‌ తీసుకునే విధానమూ కొనసాగుతుంది. కానీ అందుకు ఒక్క లేన్‌ను మాత్రమే కేటాయించి మిగ తావన్నీ ట్యాగ్‌ ఉన్న వాహనాలు వెళ్లేందుకు కేటాయిస్తారు. ఎంపిక చేసిన జాతీయ బ్యాంకులు, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంకులు, అమెజాన్, పేటీఎం లాంటి ఆన్‌లైన్‌ సంస్థల్లో చెల్లించి ఫాస్టాగ్‌ పేరుతో ఉండే స్టిక్కర్లను పొందాలి. దాన్ని వాహనం ముం దు అద్దానికి అతికించాలి. గేట్ల వద్ద ఉండే సెన్సర్లు దీన్ని స్కాన్‌ చేసి నిర్ధారిత రుసుమును మినహాయించుకుంటాయి. ఆపై ఆటోమేటిక్‌గా గేటు తెరు చుకుంటుంది. కాగా, ఫాస్టాగ్‌ విధానంలో కూడా నిర్ధారిత వాహనాలకు టోల్‌ఫీజు మినహాయింపు ఉండనుంది కానీ, ట్యాగ్‌ నుంచి మాత్రం ఉండదు.

జీరో బ్యాలెన్స్‌ ట్యాగ్‌.. 
కేంద్రం టోల్‌ నుంచి మినహాయింపునిచ్చిన వ్యక్తులకు సంబంధించిన వాహనాల సంఖ్య, రిజిస్ట్రేషన్‌ నంబరు, ఇతర వివరాలను ముందుగా ఎన్‌హెచ్‌ఏఐకి తెలపాలి. ఇందుకు ప్రత్యేక ప్రొఫార్మా రూపొందించారు. ఎన్ని వాహనాలకు అనుమతి ఉందో గుర్తించి వాటికి ప్రత్యేకంగా జీరో బ్యాలెన్స్‌ అర్హత ఉండే ఫాస్టాగ్‌లను రూపొందిస్తారు. వాటిని ఎన్‌హెచ్‌ఏఐ ప్రధాన కార్యాలయాల నుంచి సంబం ధి త వ్యక్తులకు జారీ చేస్తారు. ఆ ట్యాగ్‌లను వాహనాల అద్దాలకు అతికిస్తారు. అయితే గతంలోలాగా వీఐపీల పేర్లతో తోచినన్ని వాహనాలు టోల్‌గేట్ల నుంచి వెళ్లటానికి వీలుండదు. కచ్చితంగా ట్యాగ్‌ ఉన్న వాహనం వస్తేనే అనుమతి ఉంటుంది.  

మరిన్ని వార్తలు