ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి

20 Mar, 2018 02:46 IST|Sakshi

బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య 

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీని నియంత్రించడానికి చట్టం తేవాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం విద్యానగర్‌ బీసీ భవన్‌లో జరిగిన పలు బీసీ సంఘాల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు.

కృష్ణయ్య మాట్లాడుతూ.. కార్పొరేటు విద్యాసంస్థలు వ్యాపార దృక్పథంతో మాత్రమే పనిచేస్తున్నాయని, వాటి వల్ల ప్రజలు అప్పుల పాలవుతున్నారని విమర్శించారు. తమ పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందించాలని రైతులు అప్పులు చేసి కార్పొరేటు కాలేజీల్లో చేర్పిస్తున్నారని చెప్పారు. కార్పొరేటు విద్యాసంస్థలను కట్టడి చేసేందుకు ఒక యాజమాన్యం కింద ఒకే విద్యాసంస్థ ఉండేలా నిబంధనలను రూపొందించాలన్నారు. ఇంటర్‌ అడ్మిషన్లకు ఈ సారి నుంచే ఆన్‌లైన్‌ విధానం ప్రవేశపెట్టాలని కోరారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, నీలం వెంకటేశ్, భూపేశ్‌ సాగర్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు