నేటి నుంచి పలు రైళ్లు రద్దు, మళ్లింపు

25 May, 2018 01:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: షోలాపూర్‌–వాడి సెక్షన్‌లోని అక్కల్‌కోట్‌–నాగన్సూర్‌ రైల్వేస్టేషన్ల మధ్య చేపట్టిన డబ్లింగ్‌ పనుల వల్ల ఈ నెల 25 నుంచి 30 వరకు పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు, కొన్నింటిని దారి మళ్లించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌ కుమార్‌ గురువారం తెలిపారు.

హైదరాబాద్‌–బీజాపూర్, బొలారం–బీజాపూర్, బొలారం–హైదరాబాద్, బీజాపూర్‌–రాయ్‌చూర్, షోలాపూర్‌–గుంతకల్, గుంతకల్‌–గుల్బర్గా, గుంతకల్‌–షోలాపూర్‌ రైళ్లు రద్దు కానున్నాయి. యశ్వంతపూర్‌–షోలాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ను గుల్బర్గా వరకే నడుపుతారు. షోలాపూర్‌–ఫలక్‌నుమా ప్యాసింజర్‌ గుల్బర్గా నుంచి రాకపోకలు సాగిస్తుంది.  

దారి మళ్లించిన రైళ్లు ఇవే..: లోకమాన్యతిలక్‌–విశాఖపట్టణం ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్‌–ముంబై కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్‌–ముంబై హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌–రాజ్‌కోట్‌ ఎక్స్‌ ప్రెస్, ముంబై–బెంగళూర్‌ ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్‌–ముంబై తదితర రైళ్లను పలు మార్గాల్లో దారి మళ్లించనున్నారు.  

మరిన్ని వార్తలు