ఇంద్రవెల్లి సబ్ స్టేషన్లో అగ్నిప్రమాదం

8 Apr, 2014 08:13 IST|Sakshi

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సబ్స్టేషన్లోని మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. దాంతో సబ్ స్టేషన్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలార్పేందుకు యత్నిస్తున్నారు.

 

ఆ ప్రమాదంలో సబ్స్టేషన్లోని ట్రాన్స్ఫార్మర్లన్ని కాలి బుడిదయ్యాయి. ఇంద్రవెల్లి సబ్ స్టేషన్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిర్పూర్, జైనూర్ తదితర మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

మరిన్ని వార్తలు