వాటర్ డ్రిల్.. యమ థ్రిల్

15 Apr, 2016 01:06 IST|Sakshi
వాటర్ డ్రిల్.. యమ థ్రిల్

అగ్నిమాపక  వారోత్సవాలు ప్రారంభం

 

అగ్నిమాపక సిబ్బంది హడావిడి.. మంటలు ఆర్పుతున్నారా అన్నట్లుగా జల ప్రయోగం.. రెప్ప వాల్చకుండా ఈ సంఘటనను చూస్తూ గుమిగూడిన ప్రజలు. ఈ వివరాలను బట్టి అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తున్నారా? అరుుతే తప్పులో కాలేసినట్టే ! గురువారం జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యూరుు. హన్మకొండ బస్టాండ్, పెట్రోల్ పంప్ ఏరియూల్లో ఆ శాఖ సిబ్బంది ‘మాక్ డ్రిల్’లో సాహసోపేత విన్యాసాలను ప్రదర్శించారు. ఈసందర్భంగా జిల్లా అగ్నిమాపక అధికారి  కేశవులు ప్రజలకు అవగాహన కల్పించారు.  ఇప్పటిదాకా మనం ‘ఫైర్ వ్యాన్’నే చూశాం.

ఈ విన్యాసాల్లో అగ్నిమాపక శాఖ సిబ్బంది వినియోగించిన ‘ఫైర్ బైక్’ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మంటలు ఆర్పేందుకు వినియోగించే సామగ్రి ఈ బైక్‌లోనూ అందుబాటులో ఉండటం గమనార్హం. ‘ఫైర్ వ్యాన్’ ప్రవేశించేందుకు వీలులేని ఇరుకైన వీధుల్లో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ‘ఫైర్ బైక్’ చక్కటి సేవలు అందించగలుగుతుంది అనడంలో సందేహం లేదు.

 - పోచమ్మ మైదాన్

 

 

మరిన్ని వార్తలు