స్టడీ..రెడీ

12 Aug, 2014 02:57 IST|Sakshi
స్టడీ..రెడీ
  •      సర్వేకు సిద్ధం కండి
  •      చెక్‌లిస్ట్ రూపొందించిన జీహెచ్‌ఎంసీ
  •      స్టిక్కర్ విడుదలజేసిన కమిషనర్
  • సాక్షి, సిటీబ్యూరో: ‘కుటుంబ సమగ్ర సర్వే’పై ప్రజలకు ఎన్నో అనుమానాలు.. మరెన్నో సందేహాలు.. ఈ నెల 19న ఇళ్లకు వచ్చే సర్వే సిబ్బందికి ఎలాంటి ఆధారాలు చూపించాలన్న అంశంపై ఇంతవరకూ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు తమ వద్ద ఉంచుకోవాల్సిన వివరాల జాబితాను జీహెచ్‌ఎంసీ అధికారులు రూపొందించారు. దీనిపై అధికారులు విస్తృత ప్రచారం చేపట్టనున్నారు.

    తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో రంగుల కరపత్రాలు ముద్రించి దినపత్రికలతో పాటు ఇంటింటికీ పంపిణీ చే యనున్నారు. రెండు రోజుల ముందు నుంచే ఎన్యుమరేటర్లు ఇళ్లకు వెళ్లి ప్రజలకు అవసరమైన సమాచారం అందజేస్తారు. వారు వెళ్లిన ఇళ్లకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా తయారుచేసిన స్టిక్టర్‌ను అంటిస్తారు. దానిపై స్టిక్కర్‌పై సర్వేకు ముందు 17, 18 తేదీల్లో.. సర్వే రోజున 19న ఎన్యుమరేటర్లు వచ్చినట్లు నమోదు చేసే బాక్స్‌లున్నాయి.

    ఎన్యూమరేటర్ ఫోన్ నంబరుకూడా ఉంటుంది. సందేహాలుంటే ఆ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. 17న ఎన్యుమరేటర్ ఇంటికి రాకుంటే జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్ నంబరు 040-21111111కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చు. దానిని పలిరిశీలించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు. దాదాపు 60 వేల నుంచి 70 వేలమంది ఎన్యుమరేటర్లు విధుల్లో పాల్గొంటున్నారు. గ్యాస్ కనెక్షన్, పాస్‌పోర్టు, ఇతర సదుపాయాలు కావాలనుకునేవా రు కుటుంబ వివరాలు తప్పనిసరి గా అందజేయాలి. ఆస్తిపన్ను, విద్యుత్, నల్లాకనెక్షన్లకు సంబంధిం చిన బిల్లు రసీదులు, కుల, వికలాం గ ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌లు అందుబాటులో ఉంచుకోవాలి.
     
    సిక్టర్ ఆవిష్కణ
     
    సర్వే సందర్భంగా జీహెచ్‌ఎంసీ తయారుచేసిన స్టిక్కర్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ సోమవారం ఆవిష్కరించారు. ప్రజల కు ఎలాంటి సందేహాలు రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. ఇళ్లకు వచ్చే ఎన్యుమరేటర్లకు పూర్తి వివరాలందించేందుకు ప్రజలు ఇళ్లవద్ద ఉండాలని కోరారు. అన్ని ఇళ్ల వివరాల డేటాబేస్ రూపకల్పనకు ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందని చెప్పారు.
     

మరిన్ని వార్తలు