సగటును మించి సక్సెస్‌

17 Apr, 2017 03:49 IST|Sakshi
సగటును మించి సక్సెస్‌

రాష్ట్ర సగటును మించి ఉత్తీర్ణత సాధించిన గురుకులాలు
ఎంజేపీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ గురుకులాల్లో 92.92%


సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ ఫలితాల్లో సంక్షేమ గురుకుల కాలేజీలు రికార్డు సాధించాయి. రాష్ట్ర సగటుకు మించిన ఉత్తీర్ణతతో ముందువరుసలో నిలిచాయి. సెకండియర్‌లో అత్యధికంగా ఎంజేపీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ విద్యార్థులు 92.92% ఉత్తీర్ణత సాధించారు. టీఆర్‌ఈఐఎస్‌ గురుకులాలు 92.5% ఉత్తీర్ణత సాధిం చాయి. తర్వాత గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకులాలు ఉన్నాయి. ఈసారి ఫలితాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్‌ కాలేజీలు వెనుకబడ్డాయి.

  • సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) పరిధిలో 32 కాలేజీలున్నాయి. ఇందులో ఫస్టియర్‌లో 9,196 మంది పరీక్షలకు హాజరుకాగా.. 6,933 మంది (76.03%) ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో 8,418 మందికిగాను 7,319 మంది (87.12%) పాసయ్యారు.
  • గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) పరిధిలో 3,344 మంది ఫస్టియర్‌ పరీక్షలు రాయగా.. 2,451 మంది (73.3%) పాసయ్యారు. సెకండియర్‌లో 3,262 మందికిగాను 2,857 మంది (87.5%) ఉత్తీర్ణత సాధించారు.
  • మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎం జేపీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) పరిధిలో 11 కాలేజీలుండగా..3 కాలేజీల్లోనే ద్వితీయ సంవత్స రం ప్రారంభమైంది. సెకండియర్‌ నుంచి 339 మంది పరీక్షలురాయగా.. 315 మంది (92. 92%) ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్‌లో 1,211 మందికిగాను 914 మంది (75.47%) పాసయ్యారు.
  • రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్‌ఆర్‌జేసీ) కాలేజీల్లో 469 మంది ఫస్టియర్‌ పరీక్షలు రాయగా.. 396 మంది (84.4%) ఉత్తీ ర్ణత సాధించారు. సెకండియర్‌లో 438 మంది కిగాను 405 మంది (92.5%) పాసయ్యారు.


25 కాలేజీల్లో వందశాతం ఉత్తీర్ణత
ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తం గా 25 గురుకులాలు 100% ఉత్తీర్ణత సాధిం చాయి. ఇందులో 23 కాలేజీలు టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌కు చెందినవే కావడం విశేషం. 100% ఉత్తీర్ణత సాధించిన వాటిలో సర్వేల్‌ (టీఆర్‌ఈఐఎస్‌), దౌలతాబాద్‌ (ఎంజేపీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ నుంచి ఆసిఫాబాద్, బోథ్, జైపూర్, కడెం, సిర్పూర్, కరీంనగర్, మడికొండ, ఘన్‌పూర్, పర్వతగిరి, జాఫర్‌గడ్, అన్నపురెడ్డిపల్లి, మహే ంద్రహిల్స్, హత్నూర, తోగుట, హత్నూర, కొండాపూర్, ధర్మారం, బ్రాహ్మణపల్లి (తాడ్వా యి), మఠంపల్లి, రాజాపేట, దేవరకొండ, నదిగూడెం, రామన్నపేట గురుకులాలున్నా యి. 100% ఉత్తీర్ణత కాలేజీల సిబ్బం దిని శాఖ కార్యదర్శులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, మల్లయ్యభట్టు, శేషుకుమారి అభినందించారు.

శాఖల వారీగా గురుకుల కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం

మేనేజ్‌మెంట్‌                              ఫస్టియర్‌        సెకండియర్‌
టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌                76.03        87.12
టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌                  73.30        87.50
టీఆర్‌ఈఐఎస్‌                             84.40        92.50
ఎంజేపీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌        75.47        92.92
ప్రభుత్వ కాలేజీలు                         47.0        65.0
ఎయిడెడ్‌                                    36.0        51.0
మోడల్‌ స్కూల్‌                            56.0        71.0

మరిన్ని వార్తలు