ఇక హోటళ్లకూ గ్రేడింగ్‌!

10 Jan, 2018 01:48 IST|Sakshi

వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: ప్రజలకు ఆహార పదార్థాలను సరఫరా చేసే అన్ని రకాల హోటళ్లకు వాటి నాణ్యత ప్రమాణాలను బట్టి గ్రేడింగ్‌ విధానాన్ని అమలు చేస్తామని మంత్రి లక్ష్మా రెడ్డి తెలిపారు. మంగళవారం ఢిల్లీలో ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండి యా ఆధ్వర్యంలో కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఆహార భద్రతా సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాల సరఫరాకు ప్రధానంగా ఏడు అంశాలకు ఆమోదం తెలిపారు.

ఆహార పదార్థాల విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం, నాణ్యత విషయంలో వర్తకులు, వినియోగదారుల మధ్య భరోసా కలిగించడం, నాణ్యత పరీక్ష కేంద్రాలను పటిష్టపరచడం, పౌష్టికాహారాన్ని తీసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించడం, ఆహారపు అలవాట్లలో మార్పులను ప్రోత్సహిం చడం, వర్తకుల నాణ్యత ప్రమాణాల ఆధారంగా గ్రేడింగ్‌ ఇవ్వడం, నాణ్యత ప్రమాణాల అమలుకు పక్కా వ్యవ స్థను ఏర్పాటు చేయడం.. లాంటి అంశాల అమలుకు అన్ని రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. నాణ్యమైన ఆహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరించామన్నారు. 

మరిన్ని వార్తలు