హ్యామ్‌ రేడియో కోర్సుకు తగ్గని ఆదరణ

10 Feb, 2020 10:02 IST|Sakshi

ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న ఇంజనీరింగ్‌ విద్యార్థులు

కోర్సు వారం రోజులే..

తుపాన్‌ సమయంలో వీరి పాత్ర ఘనం  

సాక్షి, సోమాజిగూడ: సమాచార రంగంలో విప్లవాత్మకమైన మార్పులు ఎన్నివచ్చినా..హ్యామ్‌ రేడియోకి ఆదరణ తగ్గలేదని చెప్పొచ్చు. ఇప్పటి తరం వారిలో చాలా మందికి హ్యామ్‌ రేడియో గురించి అంతగా తెలియక పోయినా..తుపాను..వరదల సమయంలో హ్యామ్‌ రేడియో పాత్రను మనం మరవలేము. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ లేని చోట సైతం హ్యామ్‌ రేడియో ప్రతినిధులు సమాచారాన్ని చేరవేస్తారు. విద్యార్హతతో సంబంధం లేకుండా 12 ఏళ్లు పైబడిన వారు ఈ కోర్సు నేర్చుకోవచ్చు. బేసిక్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ప్రొసీజర్‌పై వారం పాటు నిర్వహించే కోర్సుకు పరీక్ష అనంతరం ఉత్తీర్ణత సాధించిన వారికి భారత్‌ ప్రభుత్వం(డీఓటీ) లైసెన్స్‌ మంజూరు చేస్తుంది.

నామమాత్రపు ఫీజు..
ఈ కోర్సు చేయాలను కున్న వారికి వయస్సుతో సంబంధం లేదు. 12 ఏళ్లు పైబడిన వారు కోర్సును పూర్తి చేసి అమెచ్యూర్‌ రేడియో ఆపరేటర్‌ కావచ్చు. ఒకప్పుడు వీఐపీలు మాత్రమే అమెచ్యూర్‌ రేడియోను వినియోగించేవారు. సెల్‌పోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్‌లు లేని కాలంలో అత్యాధునిక వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థగా ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతమున్న కమ్యూనికేషన్‌
రంగానికి హ్యామ్‌ రేడియో మూలమని చెప్పవచ్చు.

పుస్తకం విడుదల..
నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆప్‌ అమెచ్యూర్‌ రేడియో వ్యవస్థాపకుడు ఎస్‌.సూరి దీనిపై ఆల్‌ ఎబౌట్‌ అమెచ్యూర్‌ రేడియో అనే పుస్తకాన్ని రచించారు. అమెచ్యూర్‌ రేడియో కోర్సు పట్ల ఉన్న ఉపయోగాన్ని ఆయన తన రచన ద్వారా వివరించారు. ఇటీవల జరిగిన కార్యక్రమంలో భారత్‌ ఉప రాష్ట్ర పతి దానిని ఆవిష్కరించినట్లు సంస్థ నిర్వాహకులు చెప్పారు.  

విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌గా...
ఇంజినీరింగ్‌ ఈసీఈ విద్యార్థులు హ్యామ్‌ రేడియో కోర్సును ప్రాజెక్టు వర్కుగా చేస్తున్నారు. ఆయా కళాశాలలు ఇంటర్నషిప్‌ కోసం నగరంలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అమెచ్చూర్‌ రేడియో కార్యాలయంలో శిక్షణ ఇపిస్తున్నారు. రాజ్‌భవన్‌ రోడ్డులోని ఈ కార్యాలయంలో ఎంతో మంది శిక్షణ పొంది లైసెన్సులు పొందినట్లు సంస్థ వ్యవస్థాపకుడు ఎస్‌.సూరి తెలిపారు.
కూర్చున్న చోటనుంచే ఏదేశంవారితోనైనా మాట్లాడొచ్చు
అమెచ్యూర్‌ ఆపరేటర్‌ ఏదేశంలోనున్నా కూర్చున్న చోటనుంచే వారితో మాట్లాడొచ్చు. ఎటువంటి విద్యుత్, కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ లేని ప్రాంతం నుంచి కూడా సమాచారం పంపొచ్చు.  
వరదలు, తుపాన్, భూకంపం వంటివి వచ్చినప్పుడు హ్యామ్‌ రేడియో ఎంతో ఉపయోగ పడుతోంది.
అమెచ్యూర్‌ రేడియో అడ్వాన్స్‌ డిజిటల్‌ కమ్యూనికేషన్‌ నెట్‌ వర్క్‌ ద్వారా ఇంటర్నెట్‌ వినియోగించవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 3.5 మిలియన్‌లకు పైగా ఉన్న హ్యామర్స్‌తో మాట్లాడుతోవచ్చు.
కోర్సుపై ఆసక్తి చూపుతున్న యువత
అమెచ్యూర్‌ (హ్యామ్‌) రేడియో కోర్సు పట్ల యువత ఆసక్తి చూపుతోంది. కోర్సుతో వారికి అంతగా పనిలేకున్నా. హాబీగా చేసుకుంటున్నారు. వైర్‌లెస్‌ హ్యాండ్‌ సెట్లు చేతపట్టి అటుఇటుగా తిరగడం అదోఫ్యాషన్‌గా మారింది.పోలీసు స్టేషన్లో ఉండే వైర్‌లెస్‌ సెట్ల కంటే దీని ఫ్రీక్వెన్సీ అధికమని చెప్పవచ్చు. ఉత్తి రోజుల్లో అమెచ్యూర్‌ ఆమరేటర్లతో మాటాత్రమే మాట్లాడుకునే వారు.. ప్రకృతి విలయ తాండవం చేసినపుడు..సమాచార వ్యవస్థ చిన్నా భిన్నమైన సమయంలో తామున్నామంటూ అమెచ్యూర్‌ ఆపరేటర్లు ముందుకు వచ్చి దేశ సేవలో నిమగ్నమవుతున్నారు.

మరిన్ని వార్తలు