సమయం లేదు మిత్రమా..

10 Apr, 2018 13:57 IST|Sakshi
ఈఈని మందలిస్తున్న మంత్రి హరీష్‌రావు

మీరు నిద్ర పోతున్నారు..!

మహారాష్ట్ర వైపు నత్తనడకన పనులు

మేడిగడ్డ ఈఈపై మంత్రి హరీష్‌ ఆగ్రహం

మహదేవపూర్‌: మిత్రమా సమయం లేదు.. ప్రభుత్వం పరుగెడుతున్నా.. ఇంజినీర్లు నిద్రపోతున్నారు.. ఇలా అయితే డిసెంబర్‌లోగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం ఎలా పూర్తి చేస్తారని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు బ్యారేజీ ఈఈ రమణారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. సోమవారం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన ఆయన ఇంజినీర్లతో మాట్లాడారు. మహారాష్ట్ర వైపు పనులు వేగవంతంగా ఎందుకు నడవటం లేదని ప్రశ్నించారు. ‘తెలంగాణ వైపు ప్రభుత్వం అన్నీ సమకూర్చింది.. ఇక్కడ ఐబీ ఇంజినీర్లకు ఏం పని.. ఎల్‌అండ్‌టీ కంపెనీ పనులు చేస్తోంది. మహారాష్ట్ర వైపు ఇంకా 170 ఎకరాలు భూసేక రించాల్సి ఉంది. రైతులను ఒప్పించి భూసేకరణ చేయాలి. గడ్చిరోలి జిల్లా కలెక్టర్‌ను కలవండి.. భూసేకరణ వేగవంతం చేయండి’  అని ఆదేశించారు. గడ్చిరోలి జిల్లా కలెక్టర్‌ రంగనాయక్, జేసీతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. త్వరగా భూసేకరణ చేయాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి తానే స్వయంగా ముంబై వెళ్లి ఆర్థికశాఖ మంత్రి సుధీర్‌ ముదిగంటివార్‌తో మాట్లాడుతానన్నారు. 15రోజుల్లో భూసేకరణ పూర్తి చేసి పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.

>
మరిన్ని వార్తలు