టీవీ నటుడి ఇంట్లో చోరీ.. పోలీసులకు దొరికిపోయిన దొంగ!

18 Dec, 2023 10:18 IST|Sakshi

ప్రముఖ టీవీ నటుడి ఇంట్లో చోరీ జరిగింది. తమిళనాడుకు చెందిన శబరినాథన్.. పలు సీరియల్స్‌లో నటిస్తున్నాడు. సేలం కోరిమేడు సమీపంలోని బృందావనం గార్డెన్ ఏరియాలో నివాసం ఉంటున్నాడు. గత నెల 23న చిన్నాన్న అంత్యక్రియలకు హాజరయ్యేందుకు శబరినాథన్ కుటుంబ సభ్యులు. ఇంటికి తాళం వేసి పనమరుత్తుపట్టికి వెళ్లారు. తిరిగి 24వ తేదీన అందరూ ఇంటికి వచ్చారు.

అయితే శబరినాథన్ ఫ్యామిలీ తిరిగొచ్చే సమయానికి ఇంటి తాళం పగలగొట్టి, తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్లి పరిశీలించగా.. రూ.లక్ష నగదు, 5 గోల్డ్ కాయిన్స్, కొన్ని వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే అలగాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుతో దర్యాప్తు చేపట్టగా దొంగ దొరికాడు. ధర్మపురికి చెందిన మణికంఠన్.. ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇతడిని అరెస్ట్ చేసి, సెంట్రల్ జైలుకి తరలించారు.

>
మరిన్ని వార్తలు