'అందుకే కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి'

7 Apr, 2020 15:23 IST|Sakshi

సాక్షి,సిద్దిపేట : గజ్వేల్‌ మండలం రిమ్మనగూడలో శనిగల కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ క్తొత ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌ రావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కరోనా పట్ల మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణాలో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవడం వల్ల తక్కువ ప్రభావం ఉందన్నారు. కరోనాను నివారించాలంటే సోషల్ డిస్టెన్స్తో పాటు జాగ్రత్తలు వహించడమే తప్ప మరోమార్గం లేదన్నారు. గ్రామాల్లో కరోనాపై తీసుకుంటున్న జాగ్రత్తలు పట్టణాల్లో కనబడడం లేదన్నారు.  అందుకే పట్టణాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయన్నారు.

గ్రామాల్లో ఉపాధి కోల్పోయిన వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులకు ఆయా గ్రామాల్లో ఉపాధిహామీ పనులు చేయాలన్నారు. ఒకవేళ వారికి జాబ్ కార్డు లేనట్లయితే తక్షణమే ఇస్తామన్నారు. ఉపాధి హామీ పనిచేసే కూలీలకు డబ్బుల కొరత లేదన్నారు. అనంతరం సిద్దిపేట రెడ్డి సంక్షేమ భవన్లో 104 మంది వలస కార్మికులకు ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం, ఒక్కొక్కరికీ రూ.500 రూపాయల నగదు మంత్రి హరీశ్ రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిసి ఛైర్మన్‌ ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు