అధికారంలో ఉన్నవారు చెప్పేవే చట్టాలు

27 Nov, 2014 02:07 IST|Sakshi
అధికారంలో ఉన్నవారు చెప్పేవే చట్టాలు
  • న్యాయ దినోత్సవంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్
  • హైదరాబాద్ : అధికారంలో ఉన్నవారు  చెప్పినవే చట్టాలవుతున్నాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ఆవేదన వ్యక్తపరిచారు. ఈ దేశంలో 80 శాతం ఉన్నవారిని కాదనీ ఇరవైశాతం వారే అధికారం చలాయిస్తున్నారని అసంతృప్తి వ్యక్తపరిచారు. బుధవారం హిమాయత్‌నగర్‌లోని వెనుకబడిన తరగతుల సాధికారిత సంస్థలోనూ, నిజాం కళాశాల ఆడిటోరియంలో వేర్వేరుగా జరిగిన ‘లా దినోత్సవం’ (లా డే) కార్యక్రమాల్లో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడారు. దళిత, హరిజన, గిరిజన, బీసీలు మరింత చైతన్యవంతమై అ అధికారాన్ని చేజిక్కించుకొన్నపుడు ప్రజాస్వామ్యానికి అసలైన అర్థమన్నారు.

    ఈ సందర్భంగా చంద్రకుమార్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేదలు దశాబ్దాలుగా దొరల పల్లకీ మోస్తునే ఉన్నారన్నారు. ఇకనైనా వారు తమ వారసుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని చైతన్య పథాన నడవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి. చంద్రయ్య, విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. రామస్వామిలు కూడా ప్రసంగించారు.  
     
    వేచ్ఛా, సమానతల కోసం పోరాడిన మహనీయుడు అంబేద్కర్

    కాగా నిజాం కళాశాల ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ  భారతదేశ ప్రజల స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడిన మహా వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధిలేమి వల్లే  సమానత్వం, స్వేచ్ఛ ప్రజలకు అందడం లేదన్నారు.

మరిన్ని వార్తలు