అవిటివాడిని.. ఆదుకోండి

3 Feb, 2015 00:42 IST|Sakshi
అవిటివాడిని.. ఆదుకోండి

సంగారెడ్డి అర్బన్ : ‘బతుకుదెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లి అక్కడ కాలు విరిగిం ది. వడ్డెర  వృత్తిలో భాగంగా రాళ్లు కొడుతున్న క్రమంలో ఓ కన్ను పోయింది. అవిటివాడినైన నన్ను ఆదుకోండి’ అని గ్రీవెన్స్‌డేలో సోమవారం కొల్చారం మండల కేంద్రానికి చెందిన హనుమంతు జేసీ శరత్‌కు విజ్ఞప్తి చేశారు. సోమవారం ప్రజావిజ్ఞప్తుల దినంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు వచ్చిన అర్జీదారులు సంబంధితాధికారులకు ఫిర్యాదులను అందజేశారు.
వికలాంగుల కోటా కింద రెండేళ్ల క్రితం డీలర్ షిప్ మంజూరైన తహశీల్దార్ అనుమతి ఇవ్వడం లేదని అందోల్ మండలం పోసానిపేట్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ జేసీకి ఫిర్యాదు చేశాడు.
మినీ డెయిరీ కోసం బీసీ కార్పొరేషన్‌లో దరఖాస్తు చేసుకున్నా.. ఎన్నికల కోడ్ పేరుతో పెండింగ్ పెట్టారని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామానికి చెందిన సాయిమాల కోరారు.
సంగారెడ్డి పట్టణంలోని 2-6-126 ఇంటి నంబర్ గల ఆస్తి పన్ను రికార్డును మార్పులు చేశారని, ఈ విషయమై మున్సిపల్ అధికారులు సమాచారం ఇవ్వాలని కోరగా నిరాకరిస్తున్నారని, పూర్తి వివరాలు అందించాలని పుల్‌కల్ మండలం చక్రియాల్ గ్రామానికి చెందిన నరేందర్‌రెడ్డి కోరారు.
బ్యాంక్ వారు కారె ్పంట్ దుకాణాల కోసం రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న.. ఆరు నెలలుగా వికలాంగ శాఖ అధికారులు అనుమతి ఇవ్వడం లేదని, వికలాంగుడనైన తనకు అర్హత ఉన్న అధికారులు అడ్డుకుంటున్నారని వెంటనే రుణం మంజూరు చేయాలని కోరారు.
మనూరు మండలం కరస్‌గుత్తి గ్రామానికి చెందిన వికలాంగుడినైన విఠల్ తాను సంగారెడ్డిలోని ఆంధ్రాబ్యాంక్‌లో ట్రై వెహికిల్ నిమిత్తమై రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా.. మేనేజర్ స్పందించడం లేదని, రుణం మంజూరయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశాడు.
ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని, గ్రామంలోని ఎస్సీ కాలనీలో త్రాగునీటి సమస్య పరిష్కరించేందు బోల్ వెల్ మంజూరు చేయాలని మునిపల్లి మండలం కంకోల్ గ్రామస్తులు జేసీని కోరారు. కార్యక్రమంలో డీఆర్వో దయానంద్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు