సుప్రీంకోర్టు వివరణ తీసుకోండి

13 Dec, 2019 02:12 IST|Sakshi

ఎన్‌కౌంటర్‌ మృతదేహాలను భద్రపరచడంపై రాష్ట్రానికి హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించిన దిశ నిందితుల మృతదేహాలను భద్రపరిచే వ్యవహారంపై సుప్రీంకోర్టు వివరణ తీసుకొని తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో శుక్రవారం ఉదయం ప్రత్యేకంగా ప్రస్తావించి స్పష్టత తీసుకోవాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ను ధర్మాసనం ఆదేశించింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలపై విచారణను శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. అప్పటివరకు నిందితుల మృతదేహాల్ని గాంధీ ఆస్పత్రిలోనే భద్రపర్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులపై ఐపీసీలోని 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై వివిధ విచారణలను నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. 

ప్రభుత్వం స్పష్టత తీసుకోనవసరం లేదు: ఏజీ 
అంతకుముందు అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదిస్తూ మృతదేహాల్ని భద్రపరిచినట్లు సుప్రీంకోర్టు దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహిత్గి తీసుకువెళ్లారని చెప్పారు. దీనిపై లిఖితపూర్వక ఉత్తర్వులు ఏమీ లేవన్నారు. శుక్రవారం మృతదేహాల్ని తీసుకువెళ్లేందుకు నిందితుల కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారని, ఎన్‌కౌంటర్‌పై సందేహాలు లేనందున సుప్రీంకోర్టు నుంచి ప్రభుత్వం స్పష్టత తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. అయితే కోర్టుకు సహాయకారిగా నియమితులైన (అమికస్‌ క్యూరీ) సీనియర్‌ న్యాయవాది దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి మాత్రం ఏజీ ప్రకటనలో స్పష్టత లేదన్నారు. దీనిపై సుప్రీంకోర్టు నుంచి ప్రభుత్వం శుక్రవారం తెలుసుకుని వివరణ తీసుకోవాలని, తదుపరి విచారణను వచ్చే సోమవారానికి (16వ తేదీకి) వాయిదా వేయాలని కోరారు.

ఈ దశలో పిటిషనర్‌ తరఫు సుప్రీంకోర్టు న్యాయవాది వృందా గ్రోవర్‌ వాదిస్తూ ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు వాడిన పదాలను పరిశీలిస్తే ఎన్‌హెచ్‌ఆర్‌సీ, సిట్‌ దర్యాప్తులపై స్టే ఇచ్చిందని, హైకోర్టులోని కేసులపై కాదన్నారు. మృతదేహాల భద్రత వ్యవహారాన్ని పెండింగ్‌లో పెట్టాలని, శుక్రవారం తాము సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లి వివరణ పొందుతామని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘సుప్రీంకోర్టు స్టే అంటే హైకోర్టు విచారణ సహా కావచ్చు. అయినా ‡మీడియాలో వచ్చిన కథనాలపై కాకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వుల ద్వారా స్పష్టమైన వివరణ ముఖ్యం కాబట్టి ప్రభుత్వమే సుప్రీంకోర్టు నుంచి వివరణ తీసుకోవాలి’అని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పైపుల్లో 14 కేజీల పసిడి

ప్రజల కడుపు నింపట్లేదు: జగ్గారెడ్డి

కార్యకర్తలకు అండగా ఉంటాం

కేసీఆర్‌ 2.0 @ 365

నాన్నారు.. డెబిట్‌కార్డు..ఒక సన్‌ స్ట్రోక్‌!

షాపులకు క్యూఆర్‌...ఇది కొత్తది యార్‌!

ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య కమిషన్‌

హైదరాబాద్‌లో కజికిస్తాన్‌ కాన్సులేట్‌

జనరల్‌ నర్సింగ్‌ కోర్సు ఎత్తివేత

వారం రోజుల్లో సినిమా షూటింగ్‌లకు పర్మిషన్‌

ఈనాటి ముఖ్యాంశాలు

బయోడైవర్సిటీ ప్రమాదం.. పోలీసులకు కోర్టులో చుక్కెదురు

తెలంగాణ నేలపై అద్బుతాలు సృష్టించాలి..

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకం: చాడ

ఏం చేయాలో అర్థం కావడం లేదు : జగ్గారెడ్డి

తల్లిదండ్రులతో ‘దిశ’కు సఖ్యత లేదు..

నగరం బ్రాందీ హైదరాబాద్‌గా మారింది!

18 సంవత్సరాలు నిండకుండానే..

మిషన్‌ భగీరథకు రూ.2,176 కోట్లు

ఏటీఎంలు ఎంత భద్రం?

నగరంలో త్వరలో మొబైల్‌ షీ టాయిలెట్స్‌

ఎక్కడ అతకాలి అనే స్పష్టత వస్తుంది: సీఎం కేసీఆర్‌

ప్రాణహాని ఉంది..రక్షణ కల్పించండి

‘అందరికీ నమస్కారం..మాకూ చాల సంతోషం’

గుడ్లు తేలేయాల్సిందే!

నేటి ముఖ్యాంశాలు..

అతిపెద్ద సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ 

‘యంగ్వాన్‌’తో టెక్స్‌టైల్‌కు మహర్దశ 

ఇల్లరికం ఇష్టం లేక.. 

ఎమ్మెల్యే ఊరు బాగుంది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘గొల్లపూడి’ ఇకలేరు

ఏపీ దిశా చట్టం అభినందనీయం

గొల్లపూడి మారుతీరావు మృతికి ప్రముఖుల స్పందన

ఈ ఏడాది చాలా స్పెషల్‌

వీర్‌.. బీర్‌ కలిశార్‌

మా ఆయన గొప్ప ప్రేమికుడు