‘నిఘా’ పటిష్టం.!

17 Jun, 2015 12:09 IST|Sakshi
‘నిఘా’ పటిష్టం.!

నేర నియంత్రణకు ప్రత్యేక చర్యలు
సరిహద్దులపై డేగకన్ను
ప్రధాన కేంద్రాలు,
రహదారులపై సీసీ కెమెరాల ఏర్పాటుకు కసరత్తు
పోలీస్‌స్టేషన్లలో ఐప్యాడ్‌లు

 
మిర్యాలగూడ టౌన్: జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు.. హైవేపై అక్రమ సరుకుల రవాణా.. దొంగలు, దోపిడీదారులు ఇలా నీలగిరి నేరగాళ్లకు అడ్డాగా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక విమర్శకులకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదనుకుందో  ఏమో తెలియదు కానీ జిల్లా పోలీస్‌యంత్రాగం నేర నియంత్రణకు పక్కా చర్యలకు ఉపక్రమించినట్టు తెలిసింది. జిల్లాలో ఎవరెవరు చొరబడుతున్నారు..రహదారుపై.. పట్టణాల్లో ఏం జరుగుతోంది.. ఎప్పటికప్పుడు నాకు తెలియాల్సిందే అంటూ ఎస్పీ హుకూం జారీ చేసినట్టు సమాచారం. అందుకోసం నిఘా వ్యవస్థను పటిష్టపరిచేందుకు నడుంబిగించినట్టు తెలిసింది. ఇప్పటికే ఫేస్‌బుక్, వాట్సప్, షీ టీమ్స్ తదితర నూతన చర్యలు తీసుకున్న ఆయన మరో ముందడుగు వేశారు.

అంతటా సీసీ కెమెరాలు
ముఖ్యంగా ఉగ్రవాదులు, దోపిడీదారులు సు లువుగా జిల్లాలో ప్రవేశించి కార్యకలాపాలను చక్కదిద్దుకుని తప్పించుకుపోతున్నా కనిపెట్టలేని చేతకానితనాన్ని రూపుమాపుకునేందుకు పోలీస్‌శాఖసత్వర చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అన్ని పట్టణ, మండలకేంద్రాలు, రహదారులపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇటీవల జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, కేంద్ర ఇంటెలీజెన్స్ వర్గాల హెచ్చరికలతో పోలీస్‌స్టేషన్లలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.

స్టేషన్‌కు ఎవరెవరు వస్తున్నారు.. వారి కదలికలపై కూడా కన్నేసి ఉంచాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. పోలీస్ యంత్రంగం కేసులకు సంబంధించిన స్టేషన్ హౌస్‌ఆఫీసర్లకు ప్రత్యేకంగా ఐప్యాడ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేపడుతోంది. వీటిని అనుసంధానం చేస్తూ ప్ర త్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొం దించి పోలీస్‌స్టేషన్ల పనితీరుతో పాటు కేసులను పర్యవేక్షించనున్నారు.పోలీస్ యంత్రంగా ముం దుగా నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, భువనగిరిలలోని ప్రధాన కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది.

విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లకు..
జిల్లాల్లోని అన్నీ మున్సిపాలిటీలలో సెంట్రల్ లైటింగ్ విద్యుత్ స్తంభాలతో పాటు వివిధ సిమెంటు పరిశ్రమలు ప్రధాన రోడ్లపై ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లకు సీసీ కెమరాలను ఏర్పాటు చేచేయాలని పోలీస్ యంత్రంగం యోచిస్తుంది. దీని కోసం ఇప్పటికే మున్సిపల్ శాఖ సహా యాన్ని కోరింది. ప్రజా భ ద్రత దృష్యా ప్రభుత్వంతో పాటు పోలీస్ యంత్రంగం వాణిజ్య, వ్యాపార దుకాణాల వద్ద సొంతంగా సీసీ కెమరాలను ఏర్పాటు చేసుకోవాలని త్వరలో అదేశాలు ప్రభుత్వం నుంచి వెలువడనున్నాయి.

పోలీస్‌స్టేషన్లలో కూడా...
మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని హాలియా, మిర్యాలగూడ, హుజూర్‌నగర్ సర్కిల్ పరిధిలో సుమారు 17 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో రెండు ట్రాఫీక్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కాగా మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్‌స్టేషన్లో మాత్రమే సీసీ కెమరాను ఏర్పాటు చేశారు. మిర్యాలగూడ సబ్ డివిజనల్ కార్యాలయంతో పాటు సర్కిల్‌లోని వాడపల్లి, టూ టౌన్, మిర్యాలగూడ రూరల్, వేములపల్లి, హాలియా సర్కిల్‌లో సాగర్, పెద్దవూర, హలియా, నిడ్మనూరు, త్రిపురారం, హూజూర్‌నగర్ సర్కిల్‌లో హుజూర్‌నగర్, మఠంపల్లి, నేరేడుచర్ల, గరిడేపల్లి పోలీస్ స్టేషన్‌లతో పాటు మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌లలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. కాగా సుమారు 25వేల రూపాయల విలువ గల ఈ సీసీ కెమెరాలను త్వరలోనే అన్ని పోలీస్‌స్టేషన్‌లలో ఏర్పాటు చేసేందుకు కూడా పోలీస్ యంత్రగం చర్యలు చేపడుతోంది.

వ్యాపార, వాణిజ్య దుకాణాల్లోనూ..
ప్రైవేటు వ్యాపార, వాణిజ్య కేంద్రాల వద్ద దుకాణాదారులు సొంతంగా సీసీ కెమరాలను  ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ యంత్రాంగం కోరుతోంది. నేరాల తీవ్రతను తగ్గించేందుకు అపార్ట్‌మెంటులు, ప్రైవేటు ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, హోల్ సెల్ దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లతో పాటు గెజిటెడ్ కమ్యూనిటీ కాలనీలు, మున్సిపాలిటీలు,సినిమా హాళ్లు, మందిరాలు, దేవాలయాలలో సీసీ కెమరాలు తప్పని సరి కానున్నాయి. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే ఈ సీసీ కెమెరాల టెపులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
 
తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులో..
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాలకు నల్లగొండ జిల్లా సరిహద్దు కావడంతో నిఘూ నేత్రాన్ని పటిష్టపరిచేందుకు రెండు రాష్ట్రాల సరిహద్దులే కీలకం కానున్నాయి. దీంతో ప్రధానంగా మిర్యాలగూడ, కోదాడ, మేళ్లచెరువు మండలా రాష్ట్ర సరిహద్దులో ఉండడండతో భద్రతతను పటిష్టపెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. కాగా జిల్లాలోని అన్నీ ఆర్టీసీ బస్‌స్టేషన్లలో సీసీ కెమరాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్‌లో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వారి ఆగడాలకు కల్లెం వేయడానికి సంస్థ యాజమాన్యమే బస్టాండ్, పరిసరాల్లో సీసీ కెమరాలను ఏర్పాటు చేసేందుకు పోలీసులు అదేశాలను జారీచేయనున్నారు.

మరిన్ని వార్తలు