గాంధీ నుంచి హోంక్వారంటైన్‌కు

7 Jun, 2020 02:03 IST|Sakshi

కరోనా పాజిటివ్‌ ఉన్నా లక్షణాలు లేకుంటే ఇంటికే..

మొదటి విడతలో 21 మంది తరలింపు 

గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్‌): కరోనా పాజిటివ్‌ కేసు లు పెరిగిపోతున్న నేపథ్యంలో గత ఐదు రోజులుగా జ్వరం, జలుబు, దగ్గులేని పాజిటివ్‌ బాధితులను హోంక్వారంటై న్‌కు తరలించాలని గాంధీ ఆస్పత్రి అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు శనివారం 21మందిని హోంక్వారంటైన్‌కు తరలించారు.  ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం కరోనా పాజిటివ్‌ వచ్చిన రోగులకు పది రోజుల తర్వాత వరుసగా మూడ్రోజుల పాటు కరోనా లక్షణాలు లేకుంటే పాజిటివ్‌ ఉన్నప్పటికీ నేరుగా హోంక్వారంటైన్‌కు తరలించే వెసులుబాటు కల్పించింది. దీంతో మొదటి విడతగా 21 మందిని హోంక్వారంటైన్‌కు తరలించినట్లు గాంధీ నోడల్‌ అధికారి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఆది, సోమవారాల్లో మరికొందరికి గుర్తించి రెండవ విడతలో హోంక్వారంటైన్‌కు తరలిస్తామన్నారు. హోంక్వారంటైన్‌లో ఉన్నవారు అస్వస్థతకు గురైతే వెంటనే కోవిడ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌కు తెలపాలన్నారు. స్థానిక ప్రైమరీ హెల్త్‌సెంటర్‌ వైద్యులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తారన్నారు. హోంక్వారంటైన్‌ సౌకర్యాలు లేనివారిని అమీర్‌పేటలోని ప్రకృతి చికిత్సాలయానికి తరలిస్తామన్నారు.

>
మరిన్ని వార్తలు