ఓటమిలేని జీవితం నాది: కెసిఆర్

10 Sep, 2014 15:07 IST|Sakshi
కె.చంద్రశేఖర రావు

హైదరాబాద్:  ఓటమి అనేది తన  జీ వితంలో లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెప్పారు. అనుకున్నది ప్రతి ఒక్కటీ సాధించానన్నారు. ''తెలంగాణ రాదన్నారు. సాధించి చూపించాను''అని చెప్పారు.  తమ  ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ తాగునీటి  గ్రిడ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. మూడున్నర ఏళ్లలో తెలంగాణలోని ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.  ఉద్యమంలా ఈ కార్యక్రమం చేపడుతామన్నారు.  వాటర్ గ్రిడ్ ఏర్పాటుపై తెలంగాణలో సర్వే నిర్వహిస్తాని చెప్పారు.

గతంలో నిర్వహించిన కుటుంబ సర్వేకు విశేష స్పందన వచ్చిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడి  కూడా తెలంగాణ సర్వే గురించి అడిగారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సర్వే నిర్వహించాలని ప్రధాని మోడీకి తాను సూచించానని కేసీఆర్ చెప్పారు.
**

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు