గ్లోబల్ ఆస్పత్రిలో డాక్టర్లపై దాడిని ఖండించిన ఐఎంఏ

26 Dec, 2018 17:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్లోబల్ ఆస్పత్రిలో జరిగిన దాడిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఖండించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు సోమజిగూడా ప్రెస్ క్లబ్‌లో బుధవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వైద్యం పట్ల ఎలాంటి అనుమానాలున్నా వినియోగదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు, లేదా పోలీసులకైనా ఫిర్యాదు చేసే అవకాశం బాధితులకు ఉందని తెలిపారు.

గ్లోబల్ ఆస్పత్రిలో జరిగిన హింసాత్మక ఘటన సమాజానికి మంచిది కాదన్నారు. ఇలాంటి ఘటనలు వరుసగా జరగడం వల్లే అత్యవసర వైద్య చికిత్స అందించాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. పేషెంట్ ప్రాణాలు కాపాడడం కోసమే వైద్యులు ప్రయత్నం చేస్తారని, షేమిమ్ బేగంకు వెంటిలేటర్ పెట్టాలని వైద్యులు చెప్పినా కుటుంబ సభ్యులు సహకరించ లేదని చెప్పారు. ఆస్పత్రిలో విధ్వంసానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఐఎంఏ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డా.ప్రతాప్ రెడ్డి, రవీందర్ రావు, సంపత్ రావు, జీఎన్ రెడ్డిలు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు