పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన

2 Jan, 2015 02:41 IST|Sakshi

ఇంద్రవెల్లి : పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మృతురాలి బంధువులు మృతదేహంతో ఇంద్రవెల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాల ప్రకారం..మృత్యురాలు సుర్‌నార్ రాణి (25)కి గత మూడేళ్ల క్రితం చంద్రపూర్ జిల్లా హెర్వ గ్రామానికి చెందిన సుర్‌నార్ చంద్రకాంత్‌తో వివాహమైంది. రెండేళ్లుగా సంసారం సాఫీగా సాగగా, అదనపు కట్నం కోసం భర్త చిత్రహింసలు పెట్టేవాడు.

20 రోజుల క్రితం ఆమెను శారీరకంగా హింసించి, గర్భవతి అని కూడా చూడకుండా కొట్టడంతో అనారోగ్యానికి గురైంది. దీంతో భర్తే హర్కపూర్ అంద్‌గూడలోని తల్లిగారి ఇంటికి తీసుకెళ్లి వదిలేశాడు. తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తీసుకెళ్లారు. భర్త కొట్టిన దెబ్బలకు కడుపుల్లో బిడ్డ మృతి చెందింది.

పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ సుర్‌నార్‌రాణి బుధవారం మృతి చెందింది. కాగా ఆమెను హింసించిన భర్తపై చర్యలు తీసుకోవాలని 20 రోజుల క్రితమే స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు స్పందించలేదని వారు కుటుంబీకులు ఆరోపించారు.

రాణి మృతి కారణమైన భర్త చంద్రకాంత్ వచ్చే వరకు ఆందోళన విరవించేదిలేదని పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న ఉట్నూర్ డీఎస్పీ వెంకటేశ్వరులు, సీఐ స్వామి అక్కడికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. మృత్యురాలి భర్త, అత్త, మామలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ కూడా అక్కడికి వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పడంతో వారు శాంతించారు. అనంతరం మృత్యురాల తండ్రి డెప్‌కుండే కేశవ్ ఫిర్యాదు మేరకు తహశీల్దార్ చిత్రు, డీఎస్పీ, సీఐ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి శవ పరీక్ష నిమ్మిత్తం రిమ్స్‌కు తరలించారు. మృత్యురాలికి రెండేళ్ల కుమారుడు మహేశ్ (2)ఉన్నారు. దీంతో హర్కపూర్‌లో కొత్త సంవత్సరం రోజే విషాధచాయలు అములుకున్నాయి.

మరిన్ని వార్తలు