ఇన్‌కం సర్టిఫికెట్లు ఇవ్వొద్దు!

15 Jul, 2014 02:09 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్: వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాలకు మరో మెలిక పడింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి స్థానికత విషయంలో కొనసాగుతున్న సందిగ్ధతకు మరో అంశం జోడయింది. 1956కు ముందు నుంచి తెలంగాణలో స్థానికులే అని ధ్రువీకరించడంలో ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలనే విషయంలో స్పష్టత రావడం లేదు. ఇది తేలేవరకు ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయొద్దని అన్ని మండలాల తహసీల్దార్లకు ఆదేశాలు ఇచ్చారు. పదో తరగతిలోపు విద్యార్థులకు అవరమైతే పాత పద్ధతి (మాన్యువల్)గా ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వాలని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ నుంచి ఆ పైస్థాయి కోర్సుల్లో చేరే విద్యార్థులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయొద్దని ఆదేశించారు. వరంగల్ జిల్లాలో నాలుగు రోజులుగా ఈ ఆదేశాలు అమలవుతున్నాయి. స్థానికత అంశంతోపాటు బోగస్ రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ కూడా ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ నిలిపివేతకు కారణమని అధికారులు చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు