జాతీయ జెండాకు అవమానం

18 Aug, 2018 14:20 IST|Sakshi
మర్రిగూడెం జీపీ ఎదుట శుక్రవారం వరకు అవనతం చేయని జాతీయజెండా 

శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల వరకు అవనతం చేయని వైనం

గార్ల(ఇల్లందు) : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎగురవేసిన జాతీయ జెండాను అధికారులు శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల వరకు అవనతం చేయకుండా అవమానించారు. ఈ సంఘటన గార్ల మండలం మర్రిగూడెం పంచాయతీ కార్యాలయంలో వెలుగుచూసింది. జీపీ స్పెషలాఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్‌ రమేష్‌ ఆగస్టు 15న జెండా ఎగురవేసి అవతనం చేయకుండా ఉంచారు.

కాగా సంబంధిత అధికారులు విచారణ జరిపి జాతీయజెండాను అవమానపర్చిన అధికారులను సస్పెండ్‌ చేయాలని గ్రామస్తుడు అశోక్‌ డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై స్పెషలాఫీసర్‌ రమేష్‌ను సాక్షి వివరణ కోరగా జాతీయజెండాను అదే రోజు సాయంత్రం అవనతం చేయాలని పంచాయతీ కార్యదర్శి శివప్రసాద్‌కు తెలిపానని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన చోటుచేసుకుందని తహసీల్దార్‌ పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శికి విషయం తెలపడంతో శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతం లో జెండాను అవనతం చేసినట్లు తహసీల్దార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు