‘లెఫ్ట్’ ఎమ్మెల్యేలు రైటే చేశారా...!

14 Jun, 2015 01:55 IST|Sakshi
‘లెఫ్ట్’ ఎమ్మెల్యేలు రైటే చేశారా...!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరికీ ఓటు వేయకపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.  మిత్రపక్షమైన బీజేపీ ఎమ్మెల్యేలు సైతం ప్రథమ ప్రాధాన్యత ఓటును టీడీపీ అభ్యర్థికి వేసి రెండో ప్రాధాన్యతా ఓటును ‘‘నన్ ఆఫ్ ది అబొవ్ ’’(నోటా)కు వేసి మొత్తం తమ ఓట్లే చెల్లకుండా చేసిన వైనాన్ని రాజకీయనాయకులు గుర్తుచేస్తున్నారు.  

తాము ఎవరికీ ఓటు వేయకపోతే నోటాను ఉపయోగించుకునేందుకు ఎన్నికల సంఘమే ఈ ఏర్పాటు చేసినపుడు, ఈ అవకాశాన్ని సీపీఐ, సీపీఎం ఎమ్మెల్యేలు ఎందుకు ఉపయోగిం చుకోలేదని ఇతర వామపక్షాల నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. అధికార టీఆర్‌ఎస్‌కు ఓటువేయడం లేదని, కాంగ్రెస్, టీడీపీలకు ఓటు వేయలేమని, అందువల్ల ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని ఈ పార్టీల నేతలు ప్రకటించారే తప్ప నోటాను ఉపయోగించుకుంటున్నామని ప్రకటించకపోవడం గమనార్హమంటున్నారు.

ఓటింగ్‌లో పాల్గొనకపోవడం ద్వారా పరోక్షంగా టీఆర్‌ఎస్‌కే వారు ప్రయోజనం చేకూర్చారని వారు చెవులు కొరుక్కుంటున్నారు. సీపీఐ, సీపీఎం ఎమ్మెల్యేలు ఇద్దరు నోటాకు ఓటువేసి ఉంటే మొత్తం అభ్యర్థుల ఓట్లశాతం మారిపోయి టీఆర్‌ఎస్‌కు మరిన్ని ఓట్ల అవసరం ఏర్పడి సందిగ్ధత ఏర్పడి ఉండేదంటున్నారు. టీఆర్‌ఎస్‌కు మేలుచేయాలనే ఈ విధంగా చేశారా లేక నోటా గురించి తెలియక ఈ విధంగా చేశారా అని ఈ పార్టీల నాయకులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు