ఈసెట్‌–2019 షెడ్యూల్‌ విడుదల 

3 Mar, 2019 02:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ల్యాటరల్‌ ఎంట్రీ ద్వారా బీఈ/బీటెక్‌/బీఫార్మసీ, బీఎస్సీ (మ్యాథమెటిక్స్‌) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్‌–2019 షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 5న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. శనివారం జేఎన్‌టీయూలో సెట్‌ కమిటీ సమావేశం జరిగింది. టీఎస్‌సీహెచ్‌ఈ చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, సెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఈసెట్‌ను సీబీటీ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈసెట్‌ రిజిస్ట్రేషన్‌ను టీఎస్‌ ఆన్‌లైన్, ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల ద్వారా చేసుకోవాలన్నారు.

ఈసెట్‌ షెడ్యూల్‌... 
నోటిఫికేషన్‌ విడుదల తేదీ: మార్చి 05 
ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ మొదలు మార్చి 06 
దరఖాస్తుల స్వీకరణ గడువు    ఏప్రిల్‌ 08 
దరఖాస్తులో తప్పుల సవరణ    ఏప్రిల్‌ 11 నుంచి ఏప్రిల్‌ 18 

ఫీజు వివరాలు:     ఎస్సీ, ఎస్టీలకు రూ.400, ఇతరులకు రూ.800 
                         
రూ.500 అపరాధ రుసుముతో గడువు    ఏప్రిల్‌ 15 
రూ.1,000 అపరాధ రుసుముతో గడువు    ఏప్రిల్‌ 22 
రూ.5,000 అపరాధ రుసుముతో గడువు    ఏప్రిల్‌ 29 
రూ.10,000 అపరాధ రుసుముతో గడువు    మే 06 
హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ గడువు    మే 4 నుంచి 9వ తేదీ వరకు 

పరీక్ష తేదీ:  మే 11న  
సమయం:  ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు   

మరిన్ని వార్తలు