నేడు ఎల్బీ స్టేడియం వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు

4 Apr, 2019 07:09 IST|Sakshi

జనసేన, బీఎస్‌పీ బహిరంగ సభ నేపథ్యంలో పోలీసుల చర్యలు

సాయంత్రం నుంచి రాత్రి 7.30 గంటల మధ్య ట్రాఫిక్‌ ఆంక్షలు

సాక్షి, సిటీబ్యూరో: ఎల్బీస్టేడియంలో గురువారం జనసేన, బీఎస్పీ పార్టీల బహిరంగ సభ జరగనుండటంతో నగర పోలీసులు ట్రాఫిక్‌ అంక్షలు విధించారు. దీంతో ఎల్‌బీ స్టేడియం పరిసరాలలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7.30  వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్‌ అదనపు పోలీస్‌ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సభను దృష్టిలో ఉంచుకుని వాహనాదారులు ప్రత్యమ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. 

ట్రాఫిక్‌ ఆంక్షలిలా...
ఏఆర్‌ పెట్రోల్‌ పంపు జంక్షన్‌ నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వెళ్ళే వాహనాలను నాంపల్లి వైపు  మళ్ళిస్తారు.
అబిడ్స్, గన్‌ఫౌండ్రి నుంచి వచ్చే వాహనాలను ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రి  నుంచి చాపేల్‌ రోడ్డులో అనుమతిస్తారు.
బషీర్‌బాగ్‌ జంక్షన్‌ నుంచి జీపీఓకు వచ్చే వాహనాలను బషీర్‌బాగ్‌ జంక్షన్‌ నుంచి హైదర్‌గూడ, కింగ్‌కోఠి మీదుగా మళ్ళిస్తారు.
పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్‌ జంక్షన్‌ వైపునకు మళ్ళిస్తారు.
రాజమోహల్లా రోడ్డు నుంచి వచ్చే వాహనాలను పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి కింగ్‌ కోఠి, లేదంటే నారాయాణగూడ వైపున పంపిస్తారు.
కింగ్‌ కోఠి నుంచి బషీర్‌ బాగ్‌కు వచ్చే వాహనాలను భారతీయ విద్యాభవన్‌ వద్ద కింగ్‌కోఠి క్రాసు రోడ్డు మీదుగా తాజ్‌మహల్‌ వైపు అనుమతిస్తారు.
అంబేద్కర్‌ విగ్రహం వైపు నుంచి వచ్చే వాహనాలను లిబర్టీ జంక్షన్‌ నుంచి హిమాయత్‌నగర్‌ రోడ్డులో అనుమతిస్తారు.
ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూం నుంచి బషీర్‌ బాగ్‌కు వచ్చే వాహనాలను నాంపల్లి మార్గంలో పంపిస్తారు.
హిల్‌ ఫోర్టు నుంచి వచ్చే వాహనాలను బషీర్‌ బాగ్‌ వైపు అనుమతించరు. ఆ వాహనాలను పీసీఆర్‌ జంక్షన్‌ నుంచి నాంపల్లి రోడ్డులో పంపిస్తారు.  

పార్కింగ్‌ ప్రాంతాలిలా...
సికింద్రాబాద్‌ నుంచి వచ్చే వాహనాలు అంబేద్కర్‌ విగ్రహం, లిబర్టీ, బషీర్‌బాగ్‌ మీదుగా  ఆయ్‌కార్‌ భవన్‌ వద్దకు చేరుకుని కార్యకర్తలను దించి. వాహనాలను నెక్లెస్‌ రోడ్డు లేదా ఎన్జీఆర్‌ స్టేడియంలో పార్క్‌ చేసుకోవాలి.
ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మెహదీపట్నం, పాత నగరం నుంచి వచ్చే వాహనాలు పబ్లిక్‌ గార్డెన్‌లో వాహనాలను నిలపాలి.
ముషీరాబాద్, అంబర్‌పేట్, హిమాయత్‌నగర్‌ నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న నిజాం కాలేజీ గేటులో వాహనాలను పార్క్‌ చేయాలి.  
వీఐపీ వాహనాలను వ్యవసాయ శాఖ కార్యాలయం, ఎస్‌సీఈఆర్‌టీ, మహబూబియా కాలేజీలో వాహనాలను పార్క్‌ చేసుకోవాలి.  
మీడియా ప్రతినిధులు డి గేటు వద్ద దిగి అలియా కాలేజీ వద్ద  పార్క్‌ చేసుకోవాలి.    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు