మత్తయ్య బాటలోనే జిమ్మిబాబు!

6 Jul, 2015 13:05 IST|Sakshi
మత్తయ్య బాటలోనే జిమ్మిబాబు!

హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో A-4 నిందితుడుగా ఉన్న మత్తయ్య బాటలోనే తాజాగా జిమ్మిబాబు కూడా పయనిస్తున్నట్లు సమాచారం.  తనపై మోపిన అభియోగాలను కొట్టివేయాలంటూ జిమ్మిబాబు ఇవాళ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఏసీబీ నోటీసులు అందుకున్న జిమ్మిబాబు ఈరోజు సాయంత్రం అయిదు గంటల్లోగా ఏసీబంఈ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన విచారణకు హాజరు అవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

కాగా చంద్రబాబు, రేవంత్‌రెడ్డితో జిమ్మిబాబుకు ఉన్న సాన్నిహిత్యంపై రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరగుతోంది. జిమ్మిబాబు విచారణతో కేసులో కీలక ఆధారాలు సేకరించవచ్చని ఏసీబీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో జిమ్మిబాబు విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ దగ్గరకు సెబాస్టియన్ను తీసుకు వెళ్లటంలో జిమ్మిబాబు కీలక పాత్ర పోషించారు. ఇక మత్తయ్య వేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.

 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు