ఉద్యోగం ఒక చోట.. నివాసం మరో చోట

21 Aug, 2014 03:18 IST|Sakshi

ఇందూరు: అంగన్‌వాడీ కార్యకర్తలను ఉద్యోగంలో చేర్చుకు నే సమయంలోనే వారు స్థానికంగా నివాసముంటున్నా రా లేదా అని పరిశీలిస్తారు. స్థానికంగా ఉంటేనే ఉద్యోగంలో చేర్చుకుంటారు. కానీ, జిల్లాలో కొంత మంది కార్యకర్తలు నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటూ విధులను విస్మరిస్తున్నారు. సొంతూళ్లలోనే ఉంటూ, దూర ప్రాంతాల లో అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. దీంతో వారు సక్రమంగా విధులకు హాజరు కాలేకపోతున్నారు. అంగన్‌వాడీలు సక్రమంగా నడవకపోవడం, అయాలతో కేంద్రాలను నడిపించడం, ఫలితంగా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందటం లేదనే విషయం ఐసీడీఎస్ అధికారుల వరకు వచ్చింది.

స్పందించిన ఐ సీడీఎస్ పీడీ రాములు స్థానికంగా ఉండని అంగన్‌వాడీ కార్యకర్తల వివరాలను ప్రాజెక్టు కార్యాలయాల నుంచి తెప్పించుకున్నారు. జిల్లాలో మొత్తం మినీ, మెయిన్ కలిపి 2,700 అంగన్‌వాడీ కేంద్రాలుండగా, దాదాపు 400కు పైగా కార్యకర్తలు ఇతర ప్రాంతాలలో ఉంటున్నారని తేలింది. నెల రోజులలో అంగన్‌వాడీ కేంద్రం ఉన్న ఊరిలో, పట్టణంలో కచ్చితంగా నివాసం ఉండాలని, లేదా చర్యలు తీసుకుంటామని వారందరికీ హెచ్చరిక జారీ చేశారు.

కానీ ఈ హెచ్చరికలను ఎవరూ లెక్కచేయలేదు. గతంలో కలెక్టర్‌గా ఉన్న ప్రద్యుమ్న కూడా స్థానికేతర అంగన్‌వాడీ కార్యకర్తల వివరాలు తనకు అందజేయాలని ఐసీడీఎస్ పీడీ రాములును ఆదేశించారు. కానీ, క్షేత్ర స్థాయిలో ఉండే సీడీపీఓలు, సూపర్‌వైజర్‌లు సమాచారం అందించడంలో తీవ్ర నిర్ల క్ష్యం చేశారు. ఎంత మంది స్థానికంగా ఉండటంలేదన్న వివరాలను పక్కాగా రాబట్టలేకపోయారు. గతంలో సేకరించిన వివరాల ప్రకారం దాదాపు 400 మంది కార్యక్తలున్నట్లు అధికారులు చెబుతున్నారు.

 చర్యలు తీసుకుని ఉంటే
 హెచ్చరికలు చేసినప్పటికీ నివాసం మార్చుకోనివారిపై గట్టి చర్యలు తీసుకుంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ అధికారులు ఈ విషయంపై అంతగా దృష్టిపెట్టకపోవడ ంతోనే కార్యకర్తలు జంకడంలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల జిల్లాకు వచ్చిన ఐసీడీఎస్ ఆర్‌జేడీ రాజ్యలక్ష్మి కూడా ఈ విషయంపై సీరియస్‌గా ఉన్నా, జిల్లా అధికారులు మాత్రం అలసత్వం వహిస్తున్నారు. 

మరిన్ని వార్తలు